Monday, August 01, 2011

అభినందన--1988



సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు


లాలలాలలా..లాలాలాలలా..
ప్రేమలేదని ప్రేమించరాదని..ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..లాలలాలలా..లాలాలాలలా..

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియపడిన మనసు తలుపుతట్టి చెప్పని
ముసురుగప్పి మూగవోయి నీవుంటివి
ముసురుగప్పి మూగవోయి నీవుంటివి
మోడుబారి నీడతోడు లేకుంటినీ
ప్రేమలేదని..లలలాలలాలలా

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసికూడ చేయలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూచి రోదించనీ
ప్రేమలేదని ప్రేమించరాదని
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ..ప్రియా..జోహారులు..

No comments: