Thursday, March 07, 2013

అభిలాష--1984


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకి

పల్లవి:: 

బంతీ చామంతి..ముద్దాడుకున్నాయిలే 
బంతీ చామంతి..ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం..పెళ్ళాడుకున్నాయిలే 
నిద్దరనీ సెలవడిగీ..ఇద్దరినీ కలవమని 
నిద్దరనీ సెలవడిగీ..ఇద్దరినీ కలవమని 

చరణం::1 

తేనె వాగుల్లో మల్లెపూలల్లే తేలిపోదాములే 
గాలి వానల్లో మబ్బు జంటలై రేగిపోదాములే 
విసిరే కొనచూపే..ముసురైపోతుంటే 
ముసిరే వయసుల్లో..మతి అసలే పోతుంటే 
వేడెక్కి గుండెల్లో..తల దాచుకో 
పాదాలలో ఉన్న తడి ఆర్చుకో 
ఆకాశమంటే ఎదలో..జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే 

బంతీ చామంతి..ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం..పెళ్ళాడుకున్నాయిలే 
తారతా..తరరా..తరరా.. 

చరణం::2 

పూత పెదవుల్లో..ముద్దు గోరింకా 
బొట్టు పెట్టిందిలే 
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే 
ఒదిగే మనకేదో..ఒకటై పొమ్మంటే 
ఎదిగే వలపంతా..ఎదలొకటై రమ్మంటే 
కాలాలు కరిగించు..కౌగిళ్ళలో 
దీపాలు వెలిగించు..నీ కళ్ళతో 
ఆ మాట వింటే..కరిగే 
నా ప్రాణమంతా..నీ సొంతమేలే 

బంతీ చామంతి..ముద్దాడుకున్నాయిలే 
మల్లీ మందారం..పెళ్ళాడుకున్నాయిలే 
నిద్దరనీ సెలవడిగీ..ఇద్దరినీ కలవమని 
నిద్దరనీ సెలవడిగీ..ఇద్దరినీ కలవమని 
బంతీ చామంతి..ముద్దాడుకున్నాయిలే

Abhilasha--1984
Music::IlayaRaja
Lyrics::VeturiSundaraRamaMoorti
Singer::S.Janaki,S.P.Baalu
Cast::Chiranjeevi,Radhika,RaavuGopalaRao,

::::

bantii chamanti muddhadukunnaile
malle mandaram pelladukunnaile
niddaranee selavadigi iddarinii kalavamani
niddaranee selavadigi iddarinii kalavamani
bantii chamantii muddhadukunnaile

::::1

tene vagullo malle pulalle teelipodamule
galivanallo mabbu jantalai reegipodaamule
visire kosa chupe musurai potunte
musure vayasullo mati asale potunte
vedekki gundello tala daachuko
tapalalo unna tadi archuko
akasamante edalo jabilli niive vennellu teve

bantii chamanti muddhadukunnaile
malle mandaram pelladukunnaile
niddaranee selavadigi iddarinii kalavamani
niddaranee selavadigi iddarinii kalavamani
bantii chamantii muddhadukunnaile

::::2

puuta pedavullo muddu gorinkaa bottu pettindile
erra erranga kurra buggallo siggu tiirindile
odige manasedo okatai pommante
edige valapantaa eda lokatai rammante
kaalaalu kariginchu kaugillalo
deepaalu veliginchu nee kallato
aa mata vinte karige 
naapranamantaa nee sontamele

bantii chamanti muddhadukunnaile
malle mandaram pelladukunnaile
niddaranee selavadigi iddarinii kalavamani
niddaranee selavadigi iddarinii kalavamani
bantii chamantii muddhadukunnaile


No comments: