Thursday, March 07, 2013

కన్నె మనసులు--1966








సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణ,రాంమ్మోహన్,సుకన్య,సంధ్యరాణి,
రాధాకుమారి,వేంకటేశ్వరరావ్  

పల్లవి::

ఈ ఉదయం..నా హృదయం
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది

ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ...

చరణం::1

పడుచు పిల్ల పయ్యెదలా..పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పయ్యెదలా..పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో..కొత్త వంపులు చూపినది

ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ..


చరణం::2

చిగురాకులతో చిరుగాలీ..సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినదీ..వేసవికే చలి వేసినదీ
ఓ..ఓ..ఓహో..ఓ..ఓ..ఓహో..

ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ..

చరణం::3

సరస్సున జలకాలాడేదెవరో..తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో..తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో..పగలే వగలు రగిలే కమలమో

ఈ ఉదయం..నా హృదయం..
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ

No comments: