Thursday, March 07, 2013

కన్నె మనసులు--1966









సంగీతం::K.V..మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల,K.జమునారాణి & Chorus  

తారాగణం::కృష్ణ,రాంమ్మోహన్,సుకన్య,సంధ్యరాణి,
రాధాకుమారి,వేంకటేశ్వరరావ్  

పల్లవి::

హుం..సొ..హుం..సొ..హుం..సొ..హుం..సొ..
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
సాకీరేవు సాకూచెప్పి..సాకీరేవు సాకూచెప్పి
సరసమాడవచ్చాడు..వరసగలపవచ్చాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు

చరణం::1

ఉడుకు ఉడుకు సలవమడత ఊరేసి నానేసి 
ఊరేసి నానేసి..
ఉడుకు ఉడుకు సలవమడత ఊరేసి నానేసి 
ఉల్లిపూవుల కోక..ఉతికిపెడతానన్నాడు
మల్లెపూవుల రైక మడత పెడతానన్నాడు
ఓఓహో..ఓఓహో..ఓఓహో..ఓఓహో.. 
పడుచుపిల్లతోటి నీకు పల్లదనం ఎందుకంటే
పడుచుపిల్లతోటి నీకు పల్లదనం ఎందుకంటే
తెల్లబోయి సూసాడు..కళ్ళు తేలవేసాడు..
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు

చరణం::2

యెద్దనపుడి గాజులకు..ముద్దు ముద్దు సేతులకు
ఒద్దికేదో ఉన్నదనీ..గుద్ది గుద్ది సెప్పాడు
గుద్దీ..గుద్దీ..సెప్పాడూ..
యెద్దనపుడి గాజులకు..మ్మ్ హూ..
ముద్దు ముద్దు సేతులకు..హోయ్ హోయ్..
ఒద్దికేదో ఉన్నదనీ..గుద్ది గుద్ది సెప్పాడు
గుద్దీ..గుద్దీ..సెప్పాడూ..
వద్దకు రావద్దంటే..బుద్ధికాదు పొమ్మంటే
వద్దకు రావద్దంటే..బుద్ధికాదు పొమ్మంటే
సుద్దమగము వేసాడు..ముద్దు మొగము వేసాడూ
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు

చరణం::3

సల్లగాలి ఇసురుతు ఉంటే..బుల్లినవ్వు ముసురుతు ఉంటే
పచ్చలాలకించంగా..పదము నేను పాడుతు ఉంటే
ఓ..యబ్బా..మ్మ్ హ్హు..
సల్లగాలి ఇసురుతు ఉంటే..బుల్లినవ్వు ముసురుతు ఉంటే
పచ్చలాలకించంగా..పదము నేను పాడుతు ఉంటే
ఎప్పుడెప్పుడన్నాడూ..సెప్పుసూద్దమన్నాడు
ఎప్పుడెప్పుడన్నాడూ..సెప్పుసూద్దమన్నాడు
సిలిపికూతలేమిటంటే..సెంపలేసుకొన్నాడూ
లెంపలేసుకొన్నాడూ..

చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
సాకీరేవు సాకూచెప్పి..సాకీరేవు సాకూచెప్పి
సరసమాడవచ్చాడు..వరసగలపవచ్చాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు
చుక్కలాంటి సిన్నోడు సోకు చేసుకొన్నాడు

No comments: