Thursday, March 07, 2013

అభిలాష--1983



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకి

పల్లవి:

వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
ఏది గెలుపో..హోయ్ హోయ్ 
ఏది మలుపో..హోయ్ హోయ్
తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు

వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా

చరణం::1 

మన్మథుడు నీకు మంత్రి అనుకోకు
నీ వయసు కాచేందుకు
వయసు ఒక చాకు అది వాడుకోకు
నా మనసు కోసేందుకు
మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు
లేదనీ నీదనీ కలగని నిజమని అనుకొని ఆడకు

లాలా లాల లా..లాలా లాల లా
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా

చరణం::2

కలలకొక రూపు కనులకొక కైపు
తొలిమాపు విరి పానుపు
కవితలిక ఆపు కలుసుకో రేపు
చెబుతాను తుది తీరుపు
అహ ఏ తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు
వద్దనీ ముద్దనీ చిదుమని పెదవుని చిటికెలు వేయకు

వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
ఏది గెలుపో..హోయ్ హోయ్ 
ఏది మలుపో. హోయ్ హోయ్
తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు
లాలా లాల లా..లాలా లాల లా
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా

No comments: