Wednesday, March 14, 2012

మా నాన్న నిర్దోషి--1970::మల్వార్::రాగం



ఈ పాట మీకు వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి చిమ్మట ఖజాన పాటలు వినొచ్చు
సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::K.V.Nandana Rao 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు,విజయలలిత

మల్వార్::రాగం 

పల్లవి::

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

చరణం::1

కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలీ
కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలీ
ఏ కథలో తెలుపసాగే నీ కలలో పలుకసాగే

ఆ తీయని గాధల రాధవు నీవే ప్రియా
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

చరణం::2

మదిలో రాగమాల నవమధువై పొంగువేళ
నా తనువే పల్లవించే అణువణువే పరవశించే

ఆ గానము లో నను లీనము కానీ ప్రియా
నీ ప్రాణములో ఒక ప్రాణము కానీ ప్రియా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

No comments: