Wednesday, March 14, 2012

ఆలు మగలు--1977




ఈ పాట మీకు వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::T.చలపతిరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::S.P.బాలు

Film Directed By::Tatineni RamaRao

తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,రాజబాబు,రమాప్రభ,సత్యనారాయణ.

ఉపోద్ఘాతం::


ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు
అంతులేని సుఖదు:ఖాలలో అందరూ సహాద్యాయులే

పల్లవి::

తెలుసుకో ఈ జీవిత సత్యం..జరిగేదే ఇది ప్రతి నిత్యం
ఏ వయసునకా చోటుంది..అక్కడే నీకు పరువుంది
అప్పుడే నీకు సుఖముంది..
తెలుసుకో ఈ జీవిత సత్యం..జరిగేదే ఇది ప్రతి నిత్యం.

చరణం::1

కడుపులో శిశువు కదిలి కుదిపితే..అదియే తల్లికి ఆనందం
అక్కున చేర్చిన కొడుకు తన్నితే..అదియే తండ్రికాహ్లాదం
ఎదిగిన సుతులే మమతలు మరిచి ఎదురు తిరిగితే
నువ్వెక్కడ ????నీ పరువెక్కడ??? నీ చోటెక్కడ??
తెలుసుకో ఈ జీవిత సత్యం..జరిగేదే ఇది ప్రతి నిత్యం

చరణం::2

తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
ఆ ఉబలాటం ఆ అనురాగం కరువైపోతే
నువ్వెక్కడ?? నీ పరువెక్కడ?..నీ తోడెక్కడ?? నీ నీడెక్కడ?


Alu Magalu--1977
Music::T.Chalapati Rao
Lyrics::SreeSree
Singer::S.P.Baalu
Film Directed By::Tatineni Rama Rao
Cast::Akkineni,Vanisree,Rajabaabu,Ramaaprabha,K.Satyanaraayana.

::::::::::::::::

ii jeevita paaThaSaalalO anubhavaalE upaadhyaayulu
antulEni sukhadu:khaalalO andaroo sahaadyaayulE

:::::::::::

telusukO ii jeevita satyam..jarigEdE idi prati nityam
E vayasunakaa chOTundi..akkaDE neeku paruvundi
appuDE neeku sukhamundi..
telusukO ii jeevita satyam..jarigEdE idi prati nityam.

::::1

kaDupulO SiSuvu kadili kudipitE..adiyE talliki aanandam
akkuna chErchina koDuku tannitE..adiyE tanDrikaahlaadam
edigina sutulE mamatalu marichi eduru tirigitE
nuvvekkaDa ????nee paruvekkaDa??? nee chOTekkaDa??
telusukO ii jeevita satyam..jarigEdE idi prati nityam

::::2

tolirOjulalO aalumagaladi urakalu teesE ubalaaTam
baadhyata mugisi maLLina vayasula muDivEsEdE anuraagam
tolirOjulalO aalumagaladi urakalu teesE ubalaaTam
baadhyata mugisi maLLina vayasula muDivEsEdE anuraagam
aa ubalaaTam aa anuraagam karuvaipOtE
nuvvekkaDa?? nee paruvekkaDa?..nee tODekkaDa?? nee neeDekkaDa?


No comments: