Wednesday, March 14, 2012

కొత్త కాపురం--1975




సంగీతం::KV.మహాదేవన్
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం

కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం
కాపురం కొత్త కాపురం

చరణం::1

పాకలో ఉన్నా అది పసిడి మేడగా
మండుటెండలో ఉన్నా మల్లెల నీడగా
పాకలో ఉన్నా అది పసిడి మేడగా
మండుటెండలో ఉన్నా మల్లెల నీడగా
ఉన్నంతలో చెప్పలేని తీపిని అందించేది
గోరంతలో కొండంట తృప్తిని కలిగించేదే

కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం
కాపురం కొత్త కాపురం

చరణం::2

తన పతియే కనిపించే దైవమని
తన సతియే ఫలియించిన పుణ్యమని
తన పతియే కనిపించే దైవమని
తన సతియే ఫలియించిన పుణ్యమని
ఒకరినొకరు తెలుసుకొని ఒకటిగా నడచుకొని
బ్రతుకంతా పచ్చదనం పండించుకొనేదే

కాపురం కొత్త కాపురం

చరణం::3

చీకటిలో చిరునవ్వులు వెలిగించుకొని
బాధలలో ఆనందం పంచుకొని
చీకటిలో చిరునవ్వులు వెలిగించుకొని
బాధలలో ఆనందం పంచుకొని
కలిమిలో పొంగక లేమిలో కృంగక
వెలుగు నీడలొక్కటిగా తలబోసి చూసేదే

కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం
కాపురం కొత్త కాపురం

No comments: