Wednesday, March 14, 2012

ఆస్తిపరులు--1966




సంగీతం::K.V.మహాదేవన్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల.

అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

అందుకే నేనది పొందినది అందనిదైనా అందినది
పొందిన పిదపే తెలిసినది నేనెందుకు నీకు అందినది
అందుకే నేనది పొందినది అందనిదైనా అందినది
పొందిన పిదపే తెలిసినది నేనెందుకు నీకు అందినది
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

వలచుటలో గొప్పున్నది నిను వలపించుటలో మెప్పున్నది
పరువములో పొగరున్నది అది పరవశమైతే సొగసున్నది
వలచుటలో గొప్పున్నది నిను వలపించుటలో మెప్పున్నది
పరువములో పొగరున్నది అది పరవశమైతే సొగసున్నది
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

నాలో నేనే ఉన్నది..అది నువ్వేలే కనుగున్నది
ఇద్దరిలో అహమున్నది.. మన ఒద్దికలో ఇహమున్నది
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

No comments: