Wednesday, March 14, 2012
ఆస్తిపరులు--1966
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::సుశీల
ఫల్లవి:
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడు
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడు
చరణం::1
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే...
కాలు జారి పడ్డాడే సొగ్గాడు..
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే...
కాలు జారి పడ్డాడే సొగ్గాడు..పగటి వేషగాడల్లే...
పల్లెటుళ్ళో తిరుగుతుంటే కుక్క పిల్ల భౌ అంది...
పడుచు పిల్ల ఫక్కుమంది..ఆహహహ....
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడే..సోగ్గాడు
చరణం::2
కళ్ళజోడు వేసుకొని..గళ్ళకోటు తొడుక్కుని...
పిల్లగాలికొచ్చడే సోగ్గాడు..
కళ్ళజోడు వేసుకొని..గళ్ళకోటు తొడుక్కుని...
పిల్లగాలికొచ్చడే సోగ్గాడు..చిట్టివలస వాగు కాడ
పిట్ట తుర్రుమంటేను..బిక్కమొగమేసాడు..చుక్కలంక చూసాడు
బిక్కమొగమేసాడు..చుక్కలంక చూసాడు
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడే..సోగ్గాడు
చరణం::3
మూతి మీసం గొరుక్కోని..బోసిమొగం పెట్టుకోని...
వేట కోసం వచ్చాడే సొగ్గాడు..
మూతి మీసం గొరుక్కోని..బోసిమొగం పెట్టుకోని...
వేట కోసం వచ్చాడే సొగ్గాడు..బుల్లిదొర వచ్చెనని
కుక్కపిల్ల యెక్కిరిస్తే..యెర్రిమొగం వేసాడు...
బిక్కి బిక్కి చూసాడు.. హెహెయె...
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడే..
సొగ్గాడే చిన్ని నాయన..ఒక్క పిట్టనైన కొట్టలేడు సొగ్గాడే..సోగ్గాడు
Labels:
ఆస్తిపరులు--1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment