Wednesday, March 14, 2012

ఆస్తిపరులు--1966

14/03/2012 - నేడు కె.వి.మహదేవన్ గారి జయంతి సంధర్భంగా

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల.

ఎర్ర ఎర్రని బుగ్గల దానా ...
నల్ల నల్లని కన్నుల దానా
ఎర్ర ఎర్రని బుగ్గల దానా..
నల్ల నల్లని కన్నుల దానా
కొల్ల కొల్లగ కోరికలెన్నో కొసరుతున్నవి గుండెలోనా..
వల్ల మాలిన అల్లరి బావా..
వగలమారి బిగువుల బావా
కొల్లగొట్టిన గుండెలోనా కొసరుతున్నది నేను కానా ..

మనసు పరుగిడి మాట తడబడి మగువ కలతపడి నిలిచేదెపుడు
మనసు పరుగిడి మాట తడబడి మగువ కలతపడి నిలిచేదెపుడు
పిలుపు వినబడి ప్రియుడు కనబడి కనులు కలబడి కరిగేటపుడు
పిలుపు వినబడి ప్రియుడు కనబడి కనులు కలబడి కరిగేటప్పుడు
వల్లమాలిన అల్లరి బావా ..
వగలమారి బిగువుల బావా
కొల్లగొట్టిన గుండెలోనా కొసరుతునంది నేను కానా

చిరుత నగవులు చిరు చిరు చెమటలు చిగురు చెంపల మెరిసేదెపుడు
చిరుత నగవులు చిరు చిరు చెమటలు చిగురు చెంపల మెరిసేదెపుడు
నులి వెచ్చని నీ తొలి కౌగిలిని సిగలో మొగ్గలు విరిసేటప్పుడు
నులి వెచ్చని నీ తొలి కౌగిలిని సిగలో మొగ్గలు విరిసేటప్పుడు
ఎర్ర ఎర్రని బుగ్గల దానా..
నల్ల నల్లని కన్నుల దానా
కొల్ల కొల్లగ కోరికలెన్నో కొసరుతున్నవి గుండెలోనా...

పరువమున్నది పరుగిడుతున్నది పగ్గాలింక ఎందుకన్నది
పరువమున్నది పరుగిడుతున్నది పగ్గాలింక ఎందుకన్నది
పొద్దు ఉన్నది హద్దు ఉన్నది అంత వరకు నిన్నాగమన్నది
పొద్దు ఉన్నది హద్దు ఉన్నది అంత వరకు నిన్నాగమన్నది
ఎర్ర ఎర్రని బుగ్గల దానా..
నల్ల నల్లని కన్నుల దానా
కొల్ల కొల్లగ కోరికలెన్నో కొసరుతున్నవి గుండెలోనా ...

No comments: