Showing posts with label సువర్ణసుందరి--1957. Show all posts
Showing posts with label సువర్ణసుందరి--1957. Show all posts

Saturday, March 26, 2011

సువర్ణసుందరి--1957::ద్విజావంతి(జైజైవంతి)::రాగం




సంగీతం::ఆదినారాయణరావ్
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.సుశీల బృందం


రాగం::ద్విజావంతి(జైజైవంతి)

ఆమె::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా..ఆ..యువతీ మనోజా..ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా
నిను కొలిచేనురా..యువతీ మనోజా
ఏనాటికైనా నీ దానరా..యువతీ మనోజ
ఏనాటికైనా నీ దానరా రాజా
నవ శోభ లీను నా మేను నీ పూజకేనురా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా - ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి
మురిసి చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే
వినిచేనే ఈవేళా..
ఏనాటి కయినా నీదానరా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సువర్ణసుందరి--1957::సింధుబైరవి::రాగం::





సంగీతం::ఆదినారాయణరావ్
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.సుశీల బృందం

తారాగణం::అక్కినేని,అంజలీదేవి,గుమ్మడి,రమణారెడ్డి,రేలంగి,బాలకృష్ణ,గిరిజ, 

సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
రాగం::సింధుబైరవి:::
(  కర్నాట సంగీతం లో "అభేరి" రాగ చాయలకు దాదాపుగా సరిపోయే హిందుస్తానీ " భీం పలాశ్రీ" రాగంలో సమకూర్చిన అత్యధ్బుతమైన పాట.)

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ఆ ఆ ఆ ఆ
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..

మధుర మధుర శృతి గీతమే...

తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..

మది సేవించిన సమ్మోదమే..

జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

సువర్ణసుందరి--1957::రాగమాలిక



సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల,జిక్కి,కృష్ణవేణి

1) రాగం::హంసానంది:::
తారాగణం::అక్కినేని,అంజలీదేవి,గుమ్మడి,రమణారెడ్డి,రేలంగి,బాలకృష్ణ,గిరిజ, 
C.S.R.ఆంజనేయులు

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ....
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా..
ఆ..ఆ..ఆ..హాయి సఖాఆ..ఆ..ఆ..

హాయి హాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి వూగా ఆ..ఆ..ఆ...
లీలగా పువులు గాలికి వూగా ఆ ఆ ఆ....
లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని
మగద మగద మద గరిగ మదని

లీలగా పువులు గాలికి వూగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ..ఆ..
జంపాలగా..ఆ..ఆ..ఆ..

హాయి హాయిగా ఆమని సాగే...

2) రాగం::నటబైరవి:::

ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు

ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరిమురిసినదేమో మైమరపేమో
మయిలు రాజు దరిమురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ..ఆ..ఆ
జంపాలగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

హాయి హాయిగా ఆమని సాగే..


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ....
చూడుమా చందమామ అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ

3) రాగం::బహార్:::

(కానడ భాగేశ్రీల సమ్మేళన
వలన జనించిదంటారు

చూడుమా చందమామ...

వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ..ఆ..
జంపాలగాఆ..ఆ..ఆ..

హాయి హాయిగా ఆమని సాగే..

4) రాగం::కల్యాణి:::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ....

కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా....... కనుగవ తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవ తనియగా
చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనో..యీ
ఆనంద నాట్యాలు సేయనోయీ..
సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా

సువర్ణసుందరి--1957::హిందోళ::రాగం



సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::సముద్రాల
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,అంజలీదేవి,గుమ్మడి,రమణారెడ్డి,రేలంగి,బాలకృష్ణ,గిరిజ, 

C.S.R.ఆంజనేయులు

రాగం:::హిందోళ

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

::::1

మనసున తాళి మరువనులేర
గలమున మోలి సలుపకు రాజా
సమయము కాదురా నిను దరిచేర
సమయము కాదురా నిను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలువకురా

::::2

ఏలినవారి కొలువున గాని
మది నీరూపే మెదలినగాని
ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా