Monday, November 28, 2011

కన్యాకుమారి--1977

చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::SP.బాలసుబ్రహ్మణ్యం
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::SP.బాలు
(ఇది బాలు సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా)

పల్లవి::


ఓహో చెలీ..ఓ..నా చెలీ..
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట

చరణం::1

ఎదుట నీవు ఎదలో నీవు
ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్నీ పాటలై
మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే
నిలుపుకున్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా
పాడనా పాడనా

ఓహో చెలీ..ఓ..నా చెలీ..
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట

చరణం : 2

చీకటిలో వాకిట నిలిచి
దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదురకాచి నీకై వేచి
నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే
కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై
పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా
పాడనా పాడనా

ఓహో చెలీ..ఓ..నా చెలీ..
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట

No comments: