Monday, November 28, 2011

ఆస్తులు అంతస్తులు--1969::శివరంజని::రాగం


చిమ్మటలోని ఈ పాట మీకోసమే వినండి


సంగీతం::SP.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల

నటీ,నటులు::కృష్ణ, రేలంగి, పద్మనాభం, వాణిశ్రీ, ఎస్.వరలక్ష్మి, విజయ లలిత

రాగం::శివరంజని
హిందుస్తానీ-కర్నాటక}

పల్లవి::

ఆమె::
ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం::1

ఆమె::
ఓ..అనురాగసీమలో..అందాల కోనలో
అల్లారు ముద్దుగా ఉందామా

అతడు::
సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత
సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత
దోబూచులాడుతూ..నవ్వుకొందామా

అతడు::
ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం::2

ఆమె::
చిగురాకు జంపాల..చెలరేగు చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా..
చిగురాకు జంపాల..చెలరేగు చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా

అతడు::
నింగిలో విహరించి..నేలపై పులకించి
నింగిలో విహరించి..నేలపై పులకించి
శృంగార జలధిలో తేలుదామా

ఆమె::
ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

చరణం::3

అతడు::
వలపుల జంటగా..సరదాల పంటగా
సయ్యాట పాటలై సాగుదామా..

ఆమె::
తారా చంద్రులమై..రాధాకృష్ణులమై
తారా చంద్రులమై..రాధాకృష్ణులమై
తన్మయ మొందుతూ కరిగిపోదామా

ఇద్దరు::
ఒకటై పోదామా..ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై
పరవశమొందగా..ఏకమౌదామా..ఆ ఆ
పరవశమొందగా..ఏకమౌదామా

No comments: