చిమ్మటలోని ఈ పాట వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల
:::::
శోభన్::ఆదివారం అర్ధాంగికీ..సాయంకాలం సరసానికీ
బాబూ నీకో దండం..తల్లీ చెప్పకు అడ్డం
వారం దాకా అడగను..మళ్ళీ వరమియ్యవా
సుహాసిని::ఆదివారం శ్రీవారికీ..సాయంకాలం సినిమాలకీ
బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుంటే వరమివ్వనా
శోభన్::ఆదివారం అర్ధాంగికీ..
సుహాసిని::సాయంకాలం సినిమాలకీ
చరణం::1
శోభన్::::రాత్రీ పగలు పిల్లకు..అలకే తీర్చానుగా
సుహాసిని::రత్నాలంటీ పిల్లల తల్లిని చేశారుగా
శోభన్::::సందేళ చలిపుట్టీ సరదాగా రమ్మంటే
సుహాసిని::వందేళ్ళ జతకట్టి వంచారూ నామెడనే
ఆ పెళ్ళి రోజులన్నీ మోజు తీరా ఒక్కసారీ రానీవమ్మా
సుహాసిని::వెళా పాళా లేదూ
శోభన్::::ఈ వెర్రికి మందే లేదూ
సుహాసిని::ఈ కాపురమెట్టా చేయాలమ్మా కౌగిళ్ళలో
శోభన్::::ఆదివారం అర్ధాంగికీ..సాయంకాలం సరసానికీ
సుహాసిని::బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుంటే వరమివ్వనా
చరణం::2
సుహాసిని::చంటోడు అవుతున్నాడూ ఇంటాయనా
శోభన్::::వంటా వార్పూ అన్నీ సున్నా నారాయణా
సుహాసిని::పసివాళ్ళూ చూస్తారూ.. పరువంతా తీస్తారూ
శోభన్::::పరువంలో పడ్డాకా ఈ దరువే వేస్తారూ
సుహాసిని::వాళ్ళమ్మా నాన్న ఆడే ఆట వాళ్ళు నేర్చుకుంటారంతేనమ్మా
శోభన్::::చీకటి పడితే చింత
సుహాసిని::వెన్నెల వేళకు వంకా
శోభన్::::నే వారందాకా ఆగాలంటే ఎట్టాగమ్మా
సుహాసిని::ఆదివారం శ్రీవారికీ..సాయంకాలం సినిమాలకీ
బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుంటే వరమివ్వనా
శోభన్::ఆదివారం అర్ధాంగికీ..సాయంకాలం సరసానికీ
బాబూ నీకో దండం..తల్లీ చెప్పకు అడ్డం
వారం దాకా అడగను..మళ్ళీ వరమియ్యవా
లాలలలాలాలలా లాలలాలలాలాలలా
No comments:
Post a Comment