Monday, November 28, 2011

తులసి--1974



చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::ఘటసాల
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల

పల్లవి::

లలలలలాలల..ఆహా
లలలలలాలల..ఆహా
అహహహాహా..అహహహాహా
అహహహాహా..ఆ..ఆ..ఆ

రాజు::సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సిగ్గుపదె బుగ్గలకు చెలి నవ్వులె మిళమిళ

కల్పన::చిలిపి చిలిపి చూపులతో
నీ ఊహలె తళ తళా..

రాజు::చందమామకన్న..నీ చెలిమి చల్లనా
సన్న జాజికన్న..నీ మనసు తెల్లనా

కల్పన::నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా..ఆఆ
నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా
నిలువెల్ల పులకించు మెల్ల మెల్ల నా..

రాజు::సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సిగ్గుపదె బుగ్గలకు చెలి నవ్వులె మిళమిళ

కల్పన::చిలిపి చిలిపి చూపులతో
నీ ఊహలె తళ తళా..

చరణం::1

రాజు::పసినిమ్మ పండుకన్న..నీవు పచ్చనా
ఫలియించిన మన వలపే..వెచ్చ వెచ్చనా

కల్పన::అనురాగమేదేదో అమర భావనా..ఆ ఆ
అనురాగమేదేదో అమర భావనా..
అది నీవు దయచేసిన గొప్పదీవెనా..

రాజు::సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా
సిగ్గుపదె బుగ్గలకు చెలి నవ్వులె మిళమిళ

కల్పన::చిలిపి చిలిపి చూపులతో
నీ ఊహలె తళ తళా..

అహహహాహా..అహహహాహా
అహహహాహా..ఆ..ఆ..ఆ

No comments: