Monday, November 28, 2011

తులసి--1974

చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::ఘటసాల
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి

పల్లవి::

కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి
కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి
ఆడబిడ్డంటే అర్థమొగుడని..అన్నావే..ఏ..ఏ..
మరితీరా వస్తే..చల్లగా జారుకొంటావే

మాటవరసకు అన్నానుకాని ఓయమ్మో..
నీవు అన్నంత చేస్తావనుకోలేదు గున్నమ్మో
కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి

చరణం::1

కోటేరు ముక్కుంది..కోటంత ఎత్తుంది
మీసమంటు లేదుగానీ..పౌరుషం భలేగుందీ

అందుకే నిను మెచ్చానూ..ఒంటిగా ఇతు వచ్చానూ
శివ శివా హరి నారాయణ..చచ్చాను బాబోయ్..చచ్చాను

కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి
కలికి ముత్యాల కొలికి..రాకమ్మ ఉరికి ఉరికి

చరణం::2

ఆనాడు రాధగా..నీ మేను తాకగా
నిలువెల్ల కలిగిందీ..గిలిగింత వెచ్చగా
నిదురే..రాదాయే..గుండెలో..బాధాయే
శివ శివా నీ వాలకం..శృతిమించిపోయే..మించిపోయే

కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి
ఆడబుడ్డంటే అర్థమొగుడని..అన్నావే..ఏ..ఏ..
మరితీరా వస్తే..చల్లగా జారుకొంటావే

మాటవరసకు అన్నానుకాని ఓయమ్మో..
నీవు అన్నంత చేస్తావనుకోలేదు గున్నమ్మో
కలికి ముత్యాల కొలికి..పడకమ్మ ఉలికి ఉలికి
పడాల్కమ్మ ఉలికి ఉలికి..రాకమ్మ ఉరికి ఉరికి

No comments: