Sunday, September 04, 2011

మూగప్రేమ--1976





సంగీతం::చక్రవర్తి

రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

ఈ సంజలో..కెంజాయలో
ఈ సంజలో..కెంజాయలో
చిరుగాలుల..కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగబోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా..ఈ సంజలో

ఆ..ఆ..హా..ఓ..ఓ..హో
ఈ మేఘమే రాగస్వరమో ఆ
ఆ రాగమే మూగపదమో ఆ
ఈ చెంగు ఏ వయసు పొంగో ఆ
ఆ పొంగు ఆర్పేది ఎవరో
ఎవరో అదెవరో రెపరెపరెపరెపరెప
ఈ సంజలో

ఊ..ఊ..హూ..ఆ..ఆ..హా
పులకించి ఒక కన్నెమనసు ఆ
పలికింది తొలి తీపి పలుకు ఊ
చిలికింది అది లేత కవిత ఆ
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో
రిమజిమ రిమజిమ రిమజిమ
ఈ సంజలో

ఆ..ఆ..హా..ఓ..ఓ..హో
నా కళ్లలో ఇల్లరికము ఆ
నా గుండెలో రాచరికము ఆ
నా కళ్లలో ఇల్లరికము ఆ
నా గుండెలో రాచరికము ఆ
నీదేను నీదేను నిజము ఆ
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కలకలక ల కిలకిలకి ల ॥సంజలో॥

No comments: