Sunday, September 04, 2011

మయా బజార్--1957::రాగమాలిక



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::లీల,సుశీల,స్వర్ణలత,బృందం 



తిలంగ్,చారుకేశి,కాపీ,శంకరాభరణం::రాగాలు
రాగమాలిక 


విన్నావా యశోదమ్మ..విన్నావా యశోదమ్మ
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లర పనులు
విన్నావా యశోదమ్మ

అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్ను తినే నా చిన్న తనయుడు
ఏమి చేసెనమ్మా? ఎందుకు రవ్వచేతురమ్మా?

ఆ..మన్ను తినేవాడా వెన్న తినేవాడా
కాలి గజ్జెల సందడి సేయక
పిల్లి వలె మా ఇంట్లో దూరి ॥గజ్జెల॥
ఎత్తుగ కట్టిన ఉట్టందుకొని
దుత్తలన్నీ కింద దించుకొని
పాలన్నీ తాగేసెనమ్మా
పెరుగంతా జుర్రేసెనమ్మా
వెన్నంతా మెక్కేసెనమ్మా

ఒక్కడె ఎట్లా తినేసెనమ్మా
ఎక్కడనైనా కలదమ్మా
ఇది ఎక్కడైనా కలదమ్మా
విన్నావటమ్మా ఓ యశోద
గోపిక రమణుల కల్లలు
ఈ గోపిక రమణుల కల్లలు

ఆ..ఎలా బోకరిస్తున్నాడో
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా
భామలందరొక యుక్తిని పన్ని
గుమ్మమునొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణు గానము
ఆహా..ఇంకేం..
దొంగ దొరికెనని పోయి చూడగా
చెంగుననెటకో దాటిపోయె
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడగవమ్మా ॥వచ్చెనో॥
నాకేం తెలుసు..నేనక్కడ లేందే
మరి ఎక్కడున్నావు?
కాళింది మడుగున విషమును కలిపే
కాళియు తలపై తాండవమాడి
ఆ విష సర్పమునంతము చేసి
గోవుల చల్లగ కాశానే (3)

No comments: