Sunday, September 04, 2011

మయా బజార్--1957::మోహన::రాగం




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,P.లీల

మోహన::రాగం

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహొ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహొ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహొ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమనౌకలో హాయిగచేసే విహారణలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహొ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో
రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహొ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: