సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,P.సుశీల
శంకరాభరణం::రాగం
(హరికాంభోజి)
ఆహ నా పెళ్ళియంట
ఓహొ నా పెళ్ళియంట
ఆహ నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం
ఆహ నా పెళ్ళియంట
ఓహొ నా పెళ్ళియంట
ఆహ నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం
వీరాధి వీరులంట ధరణి కుబేరులంట
బోరు బోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట
వీరాధి వీరులంట ధరణి కుబేరులంట
బోరు బోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట
అబ్బబ్బబ్బబో హహహ
ఆహ నా పెళ్ళియంట
ఓహొ నా పెళ్ళియంట
ఆహ నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం
బాల కుమారులంట చాలా సుకుమారులంట
బాల కుమారులంట చాలా సుకుమారులంట
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్చ పోవునంట
అయ్యయ్యయ్యయో హహహ
ఆహ నా పెళ్ళియంట
ఓహొ నా పెళ్ళియంట
ఆహ నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం
తాళిగట్ట వచ్చునంట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గునాకంట
తాళిగట్ట వచ్చునంట పాగనిదమమ మమగపమమ
తాళిగట్ట వచ్చునంట పపపదమమ పగగమగగరి
తాళిగట్ట వచ్చునంట
తదోం దొం దొం దొంత తదీందీం దీంత తదోంత తదీంత
అటు తంతాం ఇటు తంతాం తంతాం తంతాం తాం సరిదపమగరిస
తాళిగట్ట వచ్చునంట ఆయ్ తాళిగట్ట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గునాకంట
మేలిముసుగు చాటుతీసి దాగుడుమూతలాడునంట
హాహహహ హహహా
తాళిగట్ట వచ్చునంట ఆయ్ తాళిగట్ట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గునాకంట
మేలిముసుగు చాటుతీసి దాగుడుమూతలాడునంట
హాహహహ హహహా
No comments:
Post a Comment