Sunday, September 04, 2011

మయా బజార్--1957::ఆభేరి::రాగం

సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,P.లీల
ఆభేరి::రాగం

నీవేనా

నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నామదిలో నిలిచి హృదయం కలవరపరిచినది నీవేనా
నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది
నీవేలే నామదిలో నిలిచి హృదయం కలవరపరిచినది నీవేలే

కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవమాయో
తెలిసి తెలియని అయోమయములో

నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నామదిలో నిలిచి హృదయం కలవరపరిచినది నీవేనా

కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి మైమరపించి నన్నలరించి

నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది
నీవేలే నామదిలో నిలిచి హృదయం కలవరపరిచినది నీవేలే
నీవేలే

No comments: