సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.జానకి
పల్లవి::
తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం..జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తతతతరతరత్త తతరరతరతరత్త
చరణం::1
రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే..హాయ్
ఆహా..మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే..హాయ్
హోయ్..రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే..హాయ్
ఆ..మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే..హాయ్
నాలోన లీలగా..నాద స్వరాలుగా
పూసింది లాలస..పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..రేరాణి వెన్నెల్లలో
ఈ మోహమెందాక..పోతున్నదో
ఈ దేహమింకేమి..కానున్నదో
వలపులే పిలువగా
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర
చరణం::2
పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే..హోయ్
హోఓఓ..పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే..హోయ్
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే..హోయ్
నా పాన్పు పంచుకో..ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ..ఈ రాతిరి
తేనెల్లు పొంగాలి..చీకట్లలో..కమ్మన్ని కౌగిళ్ళలో
నీ తోడు కావాలి..ఈ జన్మకి
నే నీడనవుతాను..నీ దివ్వెకి
పెదవులో..మధువులా
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర
No comments:
Post a Comment