సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,P.లీల
భాగేశ్రీ::రాగం
నీ కోసమెనే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో
నీ కోసమెనే జీవించునది
వెన్నెల కూడా చీకటి అయినా మనసున వెలుగే లేక పోయినా
నీ కోసమెనే జీవించునది
విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా
నీ రూపమే నే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో
నీ రూపమే నే ధ్యానించునది
హృదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ
నీ కోసమె నే జీవించునది
మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమే అయినా ఇక నాదానవేగా
నీ రూపమే నే ధ్యానించునది
ఈ విరహాములో ఈ నిరాశలో
నీ కోసమెనే జీవించునది
No comments:
Post a Comment