సంగీతం::SP.కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల,సుశీల
Film Directed By::BVithalaachaarya
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల, సూర్యకళ
పల్లవి::
చుక్కలన్ని చూస్తున్నాయీ..ఈ ఈ ఈ ఈ ఈ
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా..ఆ..చక్కనైన చినవాడా
చందమామ వస్తున్నాడు.. ఉ ఉ ఉ ఉ ఉ
చందమామ వచ్చేనూ..నిన్ను నన్ను చూసేనూ
ఎక్కడైన దాగుందామా..అందమైన చినదానా
చరణం::1
మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా
కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా
మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
చుక్కలన్ని చూస్తున్నాయీ..ఈ ఈ ఈ ఈ ఈ
చుక్కలన్ని చూచేనూ..ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా..ఆ..చక్కనైన చినవాడా
చరణం::2
కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా
కలలుగనే హృదయంలో వలపు నింపుకుందామా
కొలనులోన దాగుంటే అలలు మనను చూసేనూ
వలపులోని తీయదనం అలలే కాజేయులే
వలపులోని తీయదనం అలలే కాజేయులే
చందమామ వస్తున్నాడు..ఉ ఉ ఉ ఉ ఉ
చందమామ వచ్చేనూ..నిన్ను నన్ను చూసేనూ
ఎక్కడైన దాగుందామా..అందమైన చినదానా
చరణం::3
నా కన్నుల చాటుగా..నిన్ను దాచుకుంటానే
నా కన్నుల చాటుగా..నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా..నేను నిదురపోతాలే
నేను నీకు తోడునీ..నేను నీకు నీడనీ
నీవు నేను ఒకటైతే..జీవితము స్వర్గమే
నీవు నేను ఒకటైతే..జీవితము స్వర్గమే
చుక్కలన్ని చూస్తున్నాయీ..ఈ ఈ ఈఈ ఈ
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా..అందమైన చినదానా
No comments:
Post a Comment