Saturday, September 17, 2011

జ్వాలాద్వీప రహస్యం--1965

సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

Film Directed By::BVithalaachaarya
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల, సూర్యకళ
పల్లవి::

ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే
ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే
ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసేనులే
ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసేనులే..ఓఓఓఓఓ
ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే

చరణం::1
పచ్చ పచ్చని తీగలన్నీ పలకరించెను నాతోనే

వెచ్చ వెచ్చని ఊహలెన్నీ..విచ్చుకొన్నవి నాలోనే..హోయ్
పచ్చ పచ్చని తీగలన్నీ పలకరించెను నాతోనే
వెచ్చ వెచ్చని ఊహలెన్నీ..విచ్చుకొన్నవి నాలోనే..హోయ్
పువ్వులవిగో..యవ్వనములో..నవ్వుకొన్నవి లోలోనే..ఓఓఓఓఓ

ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే
ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసేనులే
ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే

చరణం::2

ఇంత చక్కని ఘడియలోన ఎవ్వరో నను పిలిచేదీ
ఇంత చల్లని గాలిలోనా ఎవ్వరో నను వలచేదీ ..హోయ్
ఇంత చక్కని ఘడియలోన ఎవ్వరో నను పిలిచేదీ
ఇంత చల్లని గాలిలోనా ఎవ్వరో నను వలచేదీ
ఎవరికెరుకా..రామచిలుక..ఎవరిముంగిట వాలేది..ఓఓఓఓఓ

ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే
ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే
ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసేనులే
ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసేనులే
ఎన్నడు చూడని అందాలూ కన్నుల ముందర తోచెనులే

No comments: