Saturday, September 17, 2011

భలే కృష్ణుడు--1980




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి
ఆహా..
పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి
ఆహా..
ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి
పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి
సిగ్గులన్ని దాచిపెట్టు..నిగ్గులన్ని దోచిపెట్టు..పెట్టకుంటే పెద్దొట్టు..
వద్దంటే వినడమ్మా...చూస్తాడు గుచ్చి గుచ్చి
పొద్దున్నే మొదలమ్మా పొద్దెరగని పిచ్చి..
సిగ్గులన్ని దాచుకుంటె..నిగ్గులన్ని దాచుకుంటె..పెట్టుకుంట పెద్దొట్టు
ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి
ఆహా..పొద్దున్నే మొదలమ్మా పొద్దెరగనీ పిచ్చి


కుర్ర కోరిక ఎర్ర కోకతో లగెత్తుకొస్తుంటే
ముక్కు పుడక ఆ మూతి విరుపుకే తళుక్కుమంటుంటే
చూపు వేడికే చిన్న వాడికే చురుక్కుమంటుంటే
ఇద్దరొక్కటై కౌగిలింతలో ఇరుక్కుపోతుంటే
చుక్కల ఓణి..వెన్నెల బోణీ..పగలే చేసిపోతుంటే
కన్నుల ఎంగిలి..చేతిన మల్లెలు తడిసీ మొపెడవుతుంటే
చల్లారిపోనీకు నా ముద్దు
తెల్లారిపోనివ్వు నా పొద్దూ..
హా..చల్లారిపోనీకు నా ముద్దు
తెల్లారిపోనివ్వు నా పొద్దూ..

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి..రత్తీ
పొద్దున్నే మొదలమ్మా పొద్దెరగనీ పిచ్చి

కొంగు దాటినా పడుచుపొంగులే కొరుక్కు తింటుంటే
నింగినంటినా గడుసు కోరికా కొలిక్కి రానంటే
హాయ్..మత్తు మత్తుగా మల్లె నీడలో అతుక్కు పోతుంటే
కొత్త మోజులో చేతి గాజులే చిటుక్కుమంటుంటే
వయసె నువ్వై..వలపుల గువ్వై... యెదలో గూడు కడుతుంటే
పనులే పాటై..పాటే బ్రతుకై..జతగా పాడుకుంటుంటే
చల్లారిపోనీకు ఈ ముద్దు
తెల్లారిపోనివ్వు నా పొద్దూ..
హా..చల్లారిపోనీకు ఈ ముద్దు
తెల్లారిపోనివ్వు నా పొద్దూ..

ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి
పొద్దున్నే జాబిల్లి పొడిచింది నువ్వొచ్చి
సిగ్గులన్ని దాచిపెట్టు..నిగ్గులన్ని దోచిపెట్టు..పెట్టకుంటె పెద్దొట్టు..
వద్దంటే వినడమ్మా..చూస్తాడు గుచ్చి గుచ్చి
పొద్దున్నే మొదలమ్మా పొద్దెరగని పిచ్చి..
సిగ్గులన్ని దాచుకుంటె..నిగ్గులన్ని దాచుకుంటె..పెట్టుకుంట పెద్దొట్టు
హా హా హా..ముద్దంటె వద్దనకే వయ్యారి నా రత్తి
అమ్మమ్మమ్మా..పొదూన్నే మొదలమ్మా పొద్దెరగని పిచ్చి..పిచ్చి

No comments: