సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::B.Vithalaachaarya
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల, సూర్యకళ
పల్లవి::
అతడు::లే లే లేతవయసుగల చినదానా
నువు లేచి లేచి ఇటు రావేలా
ఆమె::రా రా రాచవన్నెగల చినవాడా
నువు రావనుకొంటిని ఈ వేళా
అతడు::లే లే లేతవయసుగల చినదానా
నువు లేచి లేచి ఇటు రావేలా
ఆమె::రా రా రాచవన్నెగల చినవాడా
నువు రావనుకొంటిని ఈ వేళా
చరణం::1
ఆమె::ఏ మూల దాగున్నావో..ఏ పూల చాటున్నావో
ఏగాలి పల్లకిపైన ఏతెంచినావో
ఏ మూల దాగున్నావో..ఏ పూల చాటున్నావో
ఏగాలి పల్లకిపైన ఏతెంచినావో
అతడు::నీ చెంతనె నిలుచున్నాను
నీ చెక్కిలిలో ఉన్నాను
నీ చెంతనె నిలుచున్నాను
నీ చెక్కిలిలో ఉన్నాను
ముద్దుగ మెరిసే నీ కనుపాపల అద్దములోనే ఉన్నాను
అతడు::లే లే లేతవయసుగల చినదానా
నువు లేచి లేచి ఇటు రావేలా
ఆమె::రా రా రాచవన్నెగల చినవాడా
నువు రావనుకొంటిని ఈ వేళా
చరణం::2
ఆమె::ఆనాడు కనుగొన్నాను ఆపైన కలగన్నాను
నీ నీడ లేనినాడు నిదురించలేను
ఆనాడు కనుగొన్నాను ఆపైన కలగన్నాను
నీ నీడ లేనినాడు నిదురించలేను
అతడు::నీ కలువల కన్నులు నావే
నీ వలపుల వన్నెలు నావే
నీ కలువల కన్నులు నావే
నీ వలపుల వన్నెలు నావే
అందీ అందక అలలైసాగే అందాలన్నీ నావేలే
అతడు::లే లే లేతవయసుగల చినదానా
నువు లేచి లేచి ఇటు రావేలా
ఆమె::రా రా రాచవన్నెగల చినవాడా
నువు రావనుకొంటిని ఈ వేళా
No comments:
Post a Comment