Saturday, September 17, 2011

భలే కృష్ణుడు--1980
















సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల


ఓ హొ హో ఊ..ఆ..అ ఆ
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలె ఊగాయి నీలాల యమునలలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలె ఊగాయి నీలాల యమునలలో

అ ఆ ఆ అ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో

ఎర్రనైన సంజెలో..నల్లనయ్య నవ్వితే
పోంగింది గగనాన భూపాల రాగం
ఎర్రనైన సంజెలో..నల్లనయ్య నవ్వితే
పోంగింది గగనాన భూపాల రాగం
ఎర్రనైన సంజెలో..నల్లనయ్య నవ్వితే
పలికింది పరువాన తొలివలపు రాగం..
తొలివలపు రాగం..

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే ..
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

ఆ..అ..ఆ..రాగాలే ఊగాయి నిలాల యమునలో...

నీలమేఘశ్యాముని..నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం
నీలమేఘశ్యాముని..నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం ....
నీలమేఘశ్యాముని..నీడ సోకినంతనే..
మైమరచి రాధమ్మ మరచింది కాలం
మరచింది కాలం....

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలె ఊగాయి నీలాల యమునలలో
పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
రాధమ్మ మదిలో...

1 comment:

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి said...

madam గారు చాలా థాంక్స్ అండి..అబ్బ కృష్ణ గారు చూసారా ఎంత బాగున్నారో ..