సంగీతం::విశ్వనాధన్ - రామ్మూర్తి
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,నాగభూషణం,పద్మనాభం
పల్లవి::
రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటి
నా తోడు నీవైయుంటే..నీ నీడ నేనేనంటే
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి..
నా తోడు నీవైయుంటే..నీ నీడ నేనేనంటే
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నీ పైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీ పైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
నే మల్లెపువ్వై విరిసి..నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నే మల్లెపువ్వై విరిసి..నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నీ కాలి మువ్వల రవళి..నా భావి మోహన మురళి
నీ కాలి మువ్వల రవళి..నా భావి మోహన మురళి
ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటి
నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవై గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటి
రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
1 comment:
మాడం గారు మీ వలన ఎప్పటినుండో నేను వెతుక్కుంటున్న పాట దొరికింది మీకు ధన్యవాదములు
Post a Comment