Monday, September 05, 2011
మురళీకృష్ణ --- 1964
సంగీతం::మాస్టర్ వేణు
రచన::C.నారాయణ రెడ్డి
గాత్రం::ఘంటసాల
కనులు కనులు కలిసెను..కన్నె వయసు పిలిచెను

విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను..అసలు మనసు తెలిసెను
ముఖము పైన ముసురుకొన్న ముంగురులే అందము
ముఖము పైన ముసురుకొన్న ముంగురులే అందము
సిగ్గుచేత ఎర్రబడిన బుగ్గలదే అందము
కోరిన చిన్నదాని కోరచూపె అందము..కోరచూపె అందము
కనులు కనులు కలిసెను..కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను..అసలు మనసు తెలిసెను
దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
ముచ్చటైన చీర కొంగు ముడులు వేయుటెందుకు
పోవాలనుకున్నా పోలేవు ముందుకు..పోలేవు ముందుకు
కనులు కనులు కలిసెను..కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను..అసలు మనసు తెలిసెను
నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
కసురుకున్న మనసులోనె మిసిమివలపులూరును
కలిగిన కోపమంత కౌగిలిలో తీరును..కౌగిలిలో తీరును
కనులు కనులు కలిసెను..కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను..అసలు మనసు తెలిసెను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment