Monday, September 05, 2011

మురళీకృష్ణ --- 1964

సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ
కలలే నిజమై వలపే వరమై..కలకలలాడును జీవితము
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ

పేరేకాదు ప్రేమకు కూడ శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
పేరేకాదు ప్రేమకు కూడ శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
తనముద్దులమురళిగ నిను మార్చి
తనముద్దులమురళిగ నిను మార్చి
మోహనరాగం ఆలపించును
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ

పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
నీ మనసే మందిరముగ చేసి..ఈ..
నీ మనసే మందిరముగ చేసీ దైవం తానై వరములిచ్చును
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ

ఎక్కడివాడో ఇక్కడివాడై దక్కినాడు నీ తపస్సు ఫలించి
ఎక్కడివాడో ఇక్కడివాడై దక్కినాడు నీ తపస్సు ఫలించి
నాడొక చెట్టును మోడు చేసినా ఆ వాడే మోడుకు చిగురు పూర్చును

వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ
కలలే నిజమై వలపే వరమై..కలకలలాడును జీవితము
వస్తాడమ్మా నీ దైవమూ..వస్తుందమ్మ వసంతమూ

No comments: