సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆచార్య,ఆత్రేయ
దర్శకత్వం::P.పుల్లయ్య
నిర్మాణ సంస్థ::పద్మశ్రీ పిక్చర్స్
గాత్రం::ఘంటసాల
నటీ నటులు::అక్కినేని నాగేశ్వరరావు,జమున,శారద
ఆభేరి::రాగం
ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
పసిపాపవలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను
గుండెను గుడిగా చేసాను
నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా!
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ వున్నా ఏమైనా
ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
No comments:
Post a Comment