Tuesday, September 06, 2011

మంచి-చెడు--1963



సంగీతం::M.S.విశ్వనాధన్ - రామ్మూర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,నాగభూషణం,పద్మనాభం


పల్లవి::

ఈ ఆలస్యానికి కారణ మేమంటే
ఈ ఊరికి వస్తుండగ దారిలో ఒక దోంగ
తన అనుచరులతో నన్ను అడ్డగించాడు
కాని ఆ దోంగ ఎవరు? ఎందుకొచ్చాడు?
అనేది వివరంగా చెపుతాను

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు
కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు
కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
ఉన్నదంత యిచ్చి ఊరడించునూ
తానె ఊరుచేరువరకు తోడువచ్చును
ఊరు చేరువరకు తోడు వచ్చును

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ

ఆకలైన పులిలాగే ఉరుకును
కాని మచ్చికతో మనసు నిచ్చివేయును
కళా హృదయమున్న మేలి రసికుడు
సదా కనులలోనే కదలాడే యువకుడు
కనులలోనే కదలాడే యువకుడు

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ

రేపు వాని మనసు మారవచ్చును
వాడు మాపుమాని పగలు తిరగవచ్చును
తల్లిమనసు చల్లదనం తెలియును
వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును
ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును

తోడు నీడ ఎవరులేని ఒంటరి..
వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ
వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ

ఊరు దోచు పెద్దమనిషి వచ్చెను
తనకు నోరుకలదు కనుక గోల చేసేను
కరుణలేని కటికరాయి రూపము
దోంగ వీనికన్న మేలటన్న సత్యము
వీనికన్న మేలటన్న సత్యము

No comments: