Monday, September 05, 2011

మురళీకృష్ణ --- 1964




సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

విరిసిన పువ్వులు ముసిముసినవ్వులు
కసి కసిగా ఎందుకు కవ్విస్తున్నవి

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

ఏదో ఏదో వినబడుచున్నది
యదలో ఏదో కదలు చున్నది
ఏదో ఏదో వినబడుచున్నది
యదలో ఏదో కదలు చున్నది
తియ్యని తలపులు తలలెత్తీ
తెలియని హాయిని వెదకు చున్నది

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

మెర మెరలాడే వయసున్నది
అది బిర బిర చెర చెర పరుగెడుతున్నది
మెర మెరలాడే వయసున్నది
బిర బిర చెర చెర పరుగెడుతున్నది
మస మిసలాడే సొగసున్నది
అది గుస గుసలెన్నో చెప్పుతున్నది

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

ఆడమన్నదీ పాడమన్నది..ఓ ఓ ఓ ఓ
ఆనందానికి యర వేయమన్నది
ఊరించి నను ఉడికించి ఒంటరి తనము ఓపనన్నది
ఒంటరి తనము ఓపనన్నది..

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

ఏమని ఏమని అనుకొంటున్నది
నీ మనసేమనీ కలగంటున్నది

No comments: