Monday, September 05, 2011

మురళీకృష్ణ --- 1964




సంగీతం::మాస్టర్ వేణు
రచన::C.నారాయణ రెడ్డి
దర్శకత్వం::P.పుల్లయ్య
నిర్మాణ సంస్థ::పద్మశ్రీ పిక్చర్స్
గాత్రం::ఘంటసాల , P.సుశీల
నటీ నటులు::అక్కినేని నాగేశ్వరరావు,జమున,శారద

ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను
నా వలపంతా నీదని..నీదేనని..ఊ అనూ
ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను
నా వెలుగంతా నీవని..నీవేనని..ఊ అనూ

కలకల నవ్వే కలువకన్నులు
కలకల నవ్వే కలువకన్నులు
వలపులు తెలుపుటకే కాదా
పక్కన నిలిచిన చక్కని రూపము
చక్కిలిగింతలకే కాదా..చక్కిలిగింతలకే కాదా

ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను

పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
అహహహా..అహహహా..ఆహహహా..
పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా
హా..ఆ..కమ్మని కలలే కందామా

ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను

మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే
మ్మ్..మ్మ్..జీవితమంటే మనదేలే

ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను
నా వలపంతా నీదని..నా వెలుగంతా నీవని
ఊ అను..ఊ ఊ అను..ఔనను..ఔనౌనను
ఊ అను.అహ్హా హా హా హా

No comments: