Thursday, March 31, 2011
కంచుకోట --- 1967
సంగీతం::మహాదేవన్
రచన::డా::నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.,జానకి
సు::సరిలేరు నీకెవ్వరూ నరపాలసుధాకర
సరిలేరు నీకెవ్వరు..2
సురవైభవాన..మా భాసురకీర్తిలోన..2
సరిలేరు నీకెవ్వరూ నరపాలసుధాకర
సరిలేరు నీకెవ్వరు
జా::సరిలేరు నీకెవ్వరు..రతిరాజసుందరా..
సరిలేరు నీకెవ్వరూ..2
సిరిలోనగాని..మగసిరిలోనగానీ..2
సరిలేరు నీకెవ్వరు..రతిరాజసుందరా..
సరిలేరు నీకెవ్వరూ..
సు::ప్రజలను నీకంటి పాపలుగాకాచి..ఆ..ఆ..
ప్రజలను నీకంటి పాపలుగాకాచి..
పరరాజులదరంగ..కరవాలమునుదూసి..2
శాంతిని వెలయించి..మంచిని వెలిగించి..2
జగతినిలాలించి పాలించినావూ..
సరిలేరు నీకెవ్వరూ..నరపాలసుధాకర
సరిలేరు నీకెవ్వరూ..
జా::మరుడే తొందరచేయ..విరబోణులను గూడి
మధువే పొంగులువార..మనసార తూగాడి..ఆ..ఆ..
మరుడే తొందరచేయ..విరబోణులను గూడి
మధువే పొంగులువార..మనసార తూగాడి
నవ్వులు చిలికించి..మువ్వలుపలికించీ..2
యవ్వనవీణలు..కవ్వించినావూ..
సరిలేరు నీకెవ్వరూరతిరాజసుందరా..
సరిలేరు నీకెవ్వరూ..
సు::రాజభోజ..రవితేజ..దానజితకల్పభూజ..జోహార్..
జా::నీటగుల్కి..సుమకోటితేనెలానేటి తేటి..జోహార్..
సు::రాజభోజ..రవితేజ..దానజితకల్పభూజ..జోహార్..
జా::నీటగుల్కి..సుమకోటితేనెలానేటి తేటి..జోహార్..
సు::అసమప్రభావ..జోహార్..
జా::రసికావతంస..జోహార్..
సు::అసమప్రభావ..జోహార్..
జా::రసికావతంస..జోహార్..
సు::జోహార్..జోహార్..
జా::జోహార్..జోహార్..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సు::సరిలేరు నీకెవ్వరూ నరపాలసుధాకర
సరిలేరు నీకెవ్వరు..
జా::సిరిలోనగానీ..మగసిరిలోనగానీ..
సరిలేరు నీకెవ్వరూ..ఊ..ఉ..ఉ..
సు::సరిలేరు నీకెవ్వరూ నరపాలసుధాకర
సరిలేరు నీకెవ్వరు..
ఘంటసాల పద్యము::-
ఎచటనో గల స్వర్గంబు నిచటదించి..
నన్ను మురిపించి..మరిపించినావు..చెలియా..హూ..
నీవె జీవితాధారము..నీవే దిక్కు.....
నీదుపాదాల సాక్షిగా...నీవేరక్షా..నీవేరక్షా...ఊ...
Labels:
Hero::N.T.R,
P.Suseela,
S.Jaanaki,
కంచుకోట --- 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment