Thursday, March 31, 2011
కంచుకోట --- 1967
కోటకంచు
సంగీతం::KV.మహదేవన్
రచన:: ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు..2
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు..2
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది..2
నల్లని జడలో కరినాగుంది..నడకలలో అది కనబడుతుంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు
కళ్ళు మూసి నిదురపోతే కలలు రాని వేళే లేదు..2
కలలో కొచ్చి కబురులు చెప్పే జతగాడైనా లేడు..జతగాడైనా లేడు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది..2
మొగిలి రేకుల సొగసూ ఉంది మొన కన్నులలో పదునూ ఉంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు
వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు..2
అద్దములోన అందం చూస్తే నిద్దర రానే రాదు..నిద్దర రానే రాదు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు
Labels:
Hero::N.T.R,
P.Suseela,
Singer::Ghantasaala,
కంచుకోట --- 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment