Thursday, March 31, 2011

కంచుకోట --- 1967





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆరేయ
డైరెక్టర్::CSR.రావ్
గానం::P. సుశీల


ఉలుకులికి పడుతోందీ..ఆ ఆ హాయ్..
గిలిగింత పెడుతుంది..హోయ్
ఎందుకో ఏమో నా మనసు..
ఏ సంగతీ నాకేమి తెలుసు..2

ఇన్నాళ్ళమనకాదు ఎట్టాగో అవుతుంది
చన్నీళ్ళ తాకిడికి ఒళ్ళు జిల్లుమంటుంది
జిలు..జిలు..జిలు..మంటుంది..2
చేపలే తాకెనో..చూపులే సోకెనో..2
చెప్పలే నయ్యయ్యో..సిగ్గుముంచుకొస్తుందీ
సిగ్గుముంచుకొస్తుందీ...

ఉలుకులికి పడుతోందీ..ఆ ఆ హాయ్..
గిలిగింత పెడుతుంది..హోయ్
ఎందుకో ఏమో నా మనసు..
ఏ సంగతీ నాకేమి తెలుసు

నీటిలో అలలేమో..నిలిచిపొమ్మన్నాయి..
తోటలో పూలేమో..లేచిరమ్మన్నాయి..2
లేచిరమ్మన్నాయి..
నీటిలో నిలవనా..తోటనే పిలవనా..2
ఉన్నపాటునలేస్తి..ఊరంత నవుతుందీ
ఊరంతా నవుతుందీ...

ఉలుకులికి పడుతోందీ..ఆ ఆ హాయ్..
గిలిగింత పెడుతుంది..హోయ్
ఎందుకో ఏమో నా మనసు..
ఏ సంగతీ నాకేమి తెలుసు
ఉలుకులికి పడుతోందీ..ఆ ఆ హోయ్..

No comments: