Thursday, March 31, 2011

కంచుకోట --- 1967




సంగీతం::KV.మహాదేవన్
రచన::దాశరధి
డైరెక్టర్::CSR.రావ్
గానం::P.సుశీల

ఈ పొట్టినరోజు..నీ నోములు పండినరోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు..2

ఏ అందాలు....

తళతళ మెరిసే తారకలార..ఇలకే దిగిరండీ..2
మీలో విరిసే లేత వెలుగులు మా చెలికన్నుల నింపండి..
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలి..
నీ పొట్టినరోజు..నీ నోములు పండినరోజు

అలలపూల ఉయ్యాలల ఆడుకొనే హంసలారా..ఆ..ఆ..2
మీ నడకలవయ్యారం మా చెలికే ఇవ్వరారా..ఆ..ఆ
ఆ వయ్యారం చూసీ చూసి ఆమె ప్రియుడు మురియాలి..
ఈ పొట్టినరోజు..నీ నోములు పండినరో

పురివిప్పి నటియించు నీలాల నెమలి..2
మీలోన హొయలంత చెలికియ్యరాదా..ఆ..ఆ..
అందాలచెలి నాట్యమాడేటి వేళ.. చెలికాని
మనసెల్ల విలసిల్ల గలదు..ఆ..ఆ..ఆ..ఆ

ఈ పొట్టినరోజు..నీ నోములు పండినరోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు..
ఈ పొట్టినరోజు..నీ నోములు పండినరోజు

No comments: