Wednesday, April 30, 2008

బంగారు పంజరం--1969





బంగారు పంజరం 1969
సంగీతం::S.రాజేశ్వరరావ్,B.గోపాలం
రచన::దేవులపల్లి్‌కృష్ణశాస్రి
గానం::S.జానకి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా
పక్కనా నువ్వుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా..నువ్వుంటే..ప్రతిరాత్రి..పున్నమి రా
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా

పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
రేయైతే వెన్నెలగా బయలంత నిండెరా
రాతిరి నా రాజువు రా..రాతిరి నా రాజువు రా

నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననై
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి పున్నమి రా..
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
మ్మ్ మ్మ్..రాతిరి నా రాజువి రా

బంగారు పంజరం--1969



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లికౄష్ణశాస్త్రి
గానం::SP.బాలు.S,జానకి

ఆ....ఆ....ఆ....
మనిషే మారేనా రాజా
మనసే మారేరా
మనసులో...నా మనసులో
సరికొత్త మమతలూరేరా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

రాజా..
ఆ...
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఆ తోటపూవులేనా
అలనాట లతలేనా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

ఆ....ఆ...
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
గూట గూట దాగుండి
కొత్తగువ్వ పాడేరా
మనిషే మారేరా రాజా
మనసే మారేరా

ఆ...ఆ...
అడుగడుగున జగమంతా
అనురాగపు కనులకు
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
ఆనాటివే పువులైనా
అలనాటివే లతలైనా
మనిషే మారేనే
రాణీ మనసే మారేనే
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ...

రాధా కౄష్ణ--1978



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన:: ?
గానం::SP.బాలు,P.సుశీల

ఆ..హా...లలలలలా
ఆ..హా...లలలల
లా
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా...
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా


మల్లెలు పూచే చల్లని వేళా
మనసులు కలపాలీ...
మల్లెలు పూచే చల్లని వేళా
మనసులు కలపాలీ
అల్లరిచేసే పిల్లగాలిలో
ఆశలు పెంచాలీ..
ఒంటరి తనము ఎంతకాలము
జంటకావాలి నీకొక జంటకావాలి
ఇటు చూడవా మాటాడవా ఈ మౌనం నీకేలా

నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా...
నీవే జాబిలి
నీ నవ్వే వెన్నెలా

అ-:చల్లని వేళా నీ వొళ్ళంత
వెచ్చగ వుంటుందా
ఆ:-మ్మ్..మ్మ్..వుంటుంది
అ:-నడిరేయైన నిదురే రాక
కలతగ వుంటుందా
ఆ:-అవును అలాగే వుంటుంది
అ:-వుండి వుండి గుండెలలోన
దడ దడ మంటుందా
ఆ:-అరే !! నీకెలా తెలుసు ?
అ:-ఓమై గాడ్ ఇది చాలా పెద్ద జబ్బే..
ఆ:-మ్మ్...
అ:-ఈ పిచ్చికి ఈ ప్రేమకు
ఇక పెళ్ళేఔషదమూ...
ఆ:-హా....నీవే జాబిలీ
నీ నవ్వే వెన్నెలా
ఇటు చూడవా మాటాడవా
ఈ బింకం నీకేలా
ఆ:-నీవే జాబిలీ
నీ నవ్వే వెన్నెలా

త్రిమూర్తులు--1987



సంగీతం::బప్పిలహరి
దర్శకత్వం::K.మురళీమోహనరావు
నిర్మాత::శశిభూషణ్
సంస్థ::మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::వెంకటేష్,అర్జున్,రాజేంద్రప్రసాద్,శోభన,కుష్బూ,అశ్విని


పల్లవి:

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము
ప్రేమన్నదే చదరంగము
మనుసులనే పావులుతో ఆటాడుకుంటుంది రోజు
ఆ ఆటలో తానోడినా
అది త్యాగమే అనుకోమని
ఆ నేస్తానికి కన్నీరు తుడిచేది స్నేహం
ఈ స్నేహము చదరంగము

చరణం1:

పసి మనసు కలలు కని పాడింది ఓ పాటను
ఆ ఆ అది పెరిగి నిజమెరిగి అణిగింది తనలో తను
చిననాటి కలలన్ని చెరిపేందుకు విధిరాత చెరలాడెను
ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

చరణం2:

నీ చూపు నా చూపులోన
కలిసింది ఏ వేళనైనా
నిలిచుంది ఈనాటికైనా
వెలిగింది నా వేదన
ఓ పూవు విరబూయగానే
ఓ గాలి చెలరేగగానే
ఆ తావి తన సొంతమౌనా
ఆ తేనె తన విందుకేనా
చివరికది ఎవరిదని తేల్చేది ఈ స్నేహము

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

ఏ కళ్ళలో ఏ కళ్ళలో తెలుపున్నదో నలుపున్నదో
అది తెలిసేంతలో చేజారిపోతుంది ప్రేమ
ఈ జీవితం చదరంగము
ఈ జీవితం చదరంగము

Monday, April 28, 2008

రాధా కౄష్ణ--1978



సంగీతం:: S.రాజేశ్వర రావ్
రచన::?
గానం::SP.బాలు,P.సుశీల

రాధా..... కృష్ణా......
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిసాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడతలో ఈ వేళా..
నవ వధువు తడబాటు కలిగించెలే
కన్నయ్య వచ్చాడు పందిరిలో
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే

రాధా..... కృష్ణా......

రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే

రాధా..... కృష్ణా......
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

రాధా..... కృష్ణా......
రాధా..... కృష్ణా......

Thursday, April 24, 2008

రాధా కౄష్ణ--1978



సంగీతం::రాజేశ్వర రావ్
రచన:: ?
గానం:: S.P.బాలు P సుశీల.

ఏప్పుడో....
అప్పుడప్పుడప్పుడెప్పుడో చూసాను నున్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు నువ్వేనా ఆ జాంపండు

ఇప్పుడే....
ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న నువ్వేనా మొద్దబ్బాయి
నువ్వేనా ఆ మొద్దబ్బాయి నువ్వేనా నా మొద్దబ్బాయి

కొలను నేనుంటి కలువపూలు కోస్తుంటే
చేరుకోబోయినప్పుడు నువ్వు జారినప్పుడు
ఆ జారినప్పుడు...
నిన్ను ఎలా ఎత్తుకొన్నానో గుర్తుందా...గుర్తుందా..
అరటిపండు పట్టుకొని ఆలయంలో నువ్వుంటె
గండుకోతి పండును కాజేసినప్పుడు
కాజేసినప్పుడు
నువ్వెలా అదిరిపోయావో గుర్తుందా...గుర్తుందా..
అన్నీ గుర్తేకాని అమ్మడూ..
ఆ...
చిట్టి అమ్మడూ...
మ్మీహు...
ఈ వంపులేడ దాచావో అప్పుడూ..హా..హా....

ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న నువ్వే నా మొద్దబ్బాయి
మ్మీ...
నువ్వేనా ఆ మొద్దబ్బాయీ..
నువ్వేనా ఆ జాంపండు

బడికి నువ్వు రానంటే మెడపట్టి ఈడ్చుకొస్తే
పంతులయ్య బరితపూజ చేసినప్పుడు
ఆ చేసినప్పుడు...
నువ్వెలా తుర్రు మన్నావో గుర్తుందా..గుర్తుందా..
నువ్వుతినే జాంపండు నేను కాస్త లాక్కోని
ఉరిస్తు ఊరిస్తు తినేటప్పుడు..
ఆ తినే తప్పుడూ..
నువ్వెలా గొడవ పెట్టవో గుర్తుందా..ఆ..గుర్తుందా..
అన్నీ గుర్తే కాని కౄష్ణుడు..చిన్ని కౄష్ణుడు..
ఆ చిలిపి తనం పోలేదే ఇప్పుడు..ఆ..హా...

అప్పుడప్పుడప్పుడప్పుడో చూసాను నున్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు
నువ్వే నా ఆ మొద్దబ్బాయి
ఆ..నువ్వే నా నా జాంపండు
నువ్వే నా నా మొద్దబ్బాయి
నువ్వే నా నా జాంపండు...

నేనంటే నేనే--1968



సంగీతం::S.P.కోదండపాణి 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,కె.వి.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ.

పల్లవి::

నేనే..ఏఏఏఏఏఏఏఏఏఏఏ..ఉన్నానూ..ఊఊఊఊఊ  
నీ కోసం..మ్మ్..ఎదురు చూస్తున్నాను
లలలలలలాలా..ఆ..లలలలలలలాలా 

ఒహ్హో..నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నా కళ్ళలోన..నీ కళ్ళుదాచి
అందాలు దోచుకోవా..ఆ
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా

చరణం::1

నీ జాడలే కన్నాను..నీ నీడగా ఉన్నాను
నా నీడ నీదన్నాను..నీ తోడు రాజా
నీ జాడలే కన్నాను..నీ నీడగా ఉన్నాను
నా నీడ నీదన్నాను..నీ తోడు రాజా
చెక్కిలి..కెంపులు..కావాలా
చిక్కని..సొంపులు..కావాలా
కావాలా..కావాలా..కావాలా..ఈవేళా

ఒహ్హో..నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా..ఆ

చరణం::2

సెలఏరులాగ వస్తా..అలలాగ నినుపొంగిస్తా
సెలఏరులాగ వస్తా..అలలాగ నినుపొంగిస్తా
చెలరేగి పొంగిస్తా..ఆ..చిన్నారి రాజా
సెలఏరులాగ వస్తా..అలలాగ నినుపొంగిస్తా
చెలరేగి పొంగిస్తా..ఆ..చిన్నారి రాజా
మబ్బులపానుపు కావాల..మల్లెలదిండులు కావాల
కావాలా..కావాలా..కావాలా..ఈవేళా

ఒహ్హో..నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా..ఆ
నా కళ్ళలోన..నీ కళ్ళుదాచి
అందాలు దోచుకోవా..ఆ
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా
నువ్వే నువ్వే..నన్ను చేరుకోవా

Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,Nellooru KaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

nEnE..EEEEEEEEEEE..unnaanuu..uuuuuuuuuu  
nee kOsam..mm..eduru choostunnaanu
lalalalalalaalaa..aa..lalalalalalalaalaa 

ohhO..nuvvE nuvvE..nannu chErukOvaa
nuvvE nuvvE..nannu chErukOvaa
naa kaLLalOna..nee kaLLudaachi
andaalu dOchukOvaa..aa
nuvvE nuvvE..nannu chErukOvaa
nuvvE nuvvE..nannu chErukOvaa

::::1

nee jaaDalE kannaanu..nee neeDagaa unnaanu
naa neeDa needannaanu..nee tODu raajaa
nee jaaDalE kannaanu..nee neeDagaa unnaanu
naa neeDa needannaanu..nee tODu raajaa
chekkili..kempulu..kaavaalaa
chikkani..sompulu..kaavaalaa
kaavaalaa..kaavaalaa..kaavaalaa..iivELaa

ohhO..nuvvE nuvvE..nannu chErukOvaa
nuvvE nuvvE..nannu chErukOvaa..aa

::::2

selaErulaaga vastaa..alalaaga ninupongistaa
selaErulaaga vastaa..alalaaga ninupongistaa
chelarEgi pongistaa..aa..chinnaari raajaa
selaErulaaga vastaa..alalaaga ninupongistaa
chelarEgi pongistaa..aa..chinnaari raajaa
mabbulapaanupu kaavaala..malleladinDulu kaavaala
kaavaalaa..kaavaalaa..kaavaalaa..iivELaa

ohhO..nuvvE nuvvE..nannu chErukOvaa
nuvvE nuvvE..nannu chErukOvaa..aa
naa kaLLalOna..nee kaLLudaachi
andaalu dOchukOvaa..aa
nuvvE nuvvE..nannu chErukOvaa
nuvvE nuvvE..nannu chErukOvaa 

Wednesday, April 23, 2008

జగత్ జెంత్రీలు--1971


  
సంగీతం::S.P.కోదండపాణి
రచన::కోసరాజు రాఘవయ్య 
గానం::P.సుశీల,ఘంటసాల 
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

పల్లవి::

పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో
పచ్చ జొన్న చేనుకాడా చూసానమ్మీ
నువ్వు దొంగ చూపులతోటి మనసు దోచావమ్మీ
అబ్బ తిప్పుకుందామంటే తిరిగి రాదోలమ్మీ 

చరణం::1

కమ్మని నీ కౌగిట్లో రంజుగ కులకాలని నాకున్నదీ
కసి తీరంగా నాలుగు చేతులు కలపాలని నాకున్నదీ
ఇద్దరి ఆశలు తీరేవేళా దగ్గరలోనే ఉన్నదీ
ఇద్దరి ఆశలు తీరేవేళా దగ్గరలోనే ఉన్నదీ
అందాకా అమ్మాయిగారినీ సమాళించమంటున్నదీ
పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో

చరణం::2

కాదు కూడదని చలాయిస్తివా పక్కన బావి ఉందయ్యో
అవునని తల ఒగ్గావా చూస్కో కందిచేను పెరిగుందయ్యో
చూపులు రెండూ ఏకమైనపుడు మాటల పని ఏమున్నదీ
చూపులు రెండూ ఏకమైనపుడు మాటల పని ఏమున్నదీ
పూల తెప్పపై హాయి హాయిగా తేలిపోతే హాయున్నదీ
పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో

Tuesday, April 15, 2008

మహాకవి క్షేత్రయ్య--1976



సంగీతం::ఆది నారాయణ రావ్
రచన:: దాశరథి
గానం::V.రామకౄష్ణ P.సుశీల

జాబిల్లి చూసేను నిన్ను నన్ను ఓయమ్మో..
నాకెంత సిగ్గాయే బావా బావా నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయబ్బో..
నీకింత సిగ్గేల బాలా రావా నను చేర రావా

ఆకాష మార్గాన అందాల మేఘాలు పెనవేసుకొన్నాయి చూడూ
చిగురాకు సరదాల చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడూ
అంద చందాలతో ప్రేమబంధాలతో జీవితం హాయిగా సాగనీ...
బాలా రావా నను చేర రావా

ఆ...ఆ...
ఆ కొమ్మపైనున్న అందాల చిలుకలు అనురాగ గీతాలు పాడేనూ
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెదలు మైమరచి కలలందు కరిగేనూ
ముద్దుమురిపాలతో బావ రాగాలతో యవ్వనం పువ్వులా నవ్వనీ....
బావా బావా నను వీడలేవా

ఆ....ఆ....
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగీటు మీటులే కోరేనూ...
నీలేత అధరాలు ఎంతెంత మధురాలు ఈనాడు నాసొంతమాయేనూ
దేవి దీవించెనూ స్వామి వరమిచ్చెనూ ఇద్దరం ఏకమౌదాములే...
బాలా బాలా నను చేర రావా

జాబిల్లి చూసేను నిన్ను నన్ను
ఓయమ్మో....
నాకెంత సిగ్గాయే బావా బావా నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను
ఓయబ్బో....
నీకింత సిగ్గేల బాలా రావా నను చేర రావా
ఆ....ఆ...హ..హా...హా...ఆ..
ఆ...ఆ...హా..హా...హా...ఆ...
ఆ....ఆ...హ..హా...హా...ఆ..
ఆ...ఆ...హా..హా...హా...ఆ...

Thursday, April 10, 2008

జగత్ జెంత్రీలు--1971



సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.విజయరత్నం 
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

పల్లవి::

నీ..ఈఈఈఈ..మనసులోకి రావాలి కాపురానికి
నే అద్దె ఎంత..ఇవ్వాలీ మాసానికీ
నే అద్దె ఎంత..ఇవ్వాలీ మాసానికీ
నా..ఆఆఆ..మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత..తెలియాలి ఇవ్వడానికీ
నీ విషయమంత..తెలియాలి ఇవ్వడానికీ

చరణం::1

అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేసాడూ..ఆహా
అబ్బొబ్బొ అయ్యయ్యో మెల్లగ దోచాడూ..హాయ్..హాయ్
అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేసాడూ
అబ్బొబ్బొ అయ్యయ్యో మెల్లగ దోచాడూ
ఏమేమో చేసాడమ్మో..ఓఓఓఓఓఓఓ
నే మైమరచి పొయ్యానమ్మో 
చేసింది ఏముంది...చేసేది రేపుంది
చేసింది ఏముంది...చేసేది రేపుంది
ఉలికి ఉలికి పడబోకు..ఉన్నదంత ముందుందీ
ఎంతెంతో ఉందమ్మో..ఓఓఓఓఓఓ..ఇంకెంతో ఉందమ్మో 
నా మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికీ
ఆఆఆ..నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికీ 

చరణం::2

అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసిందీ..మ్మ్ హూ 
అబ్బొబ్బొ ఒళ్ళంతా అల్లుకు పొయిందీ 
అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసిందీ
అబ్బొబ్బొ ఒళ్ళంతా అల్లుకు పొయిందీ 
ఎన్నెన్నో చేసిందమ్మో..ఓఓఓఓఓఓ..
అందకుండ పోయిందమ్మో
వారెవ్వా మొనగాడా..తగ్గాలి నీ జోరూ
వారెవ్వా మొనగాడా..తగ్గాలి నీ జోరూ
జగజ్జంత్రి నీవైతే..జగజ్జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే..జగమంత మనదేలే
జగమంత మనదేలే..ఏఏఏఏఏ..ఈ యుగమంతా మనదేలే
ఆఆహా..ఆహహహహహా..లలాలలాలలలా
ఓహోహో..ఓహోహో..ఓహోహో..మ్మ్ మ్మ్ మ్మ్