Wednesday, April 30, 2008

బంగారు పంజరం--1969



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దేవులపల్లికౄష్ణశాస్త్రి
గానం::SP.బాలు.S,జానకి

ఆ....ఆ....ఆ....
మనిషే మారేనా రాజా
మనసే మారేరా
మనసులో...నా మనసులో
సరికొత్త మమతలూరేరా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

రాజా..
ఆ...
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఏచోట దాగేనో
ఇన్నాళ్ళు ఈ సొగసు
ఆ తోటపూవులేనా
అలనాట లతలేనా
మనిషే మారేనా రాజా
మనసే మారేరా

ఆ....ఆ...
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకుల గూడేరా
గూట గూట దాగుండి
కొత్తగువ్వ పాడేరా
మనిషే మారేరా రాజా
మనసే మారేరా

ఆ...ఆ...
అడుగడుగున జగమంతా
అనురాగపు కనులకు
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
కులుకుతూ కొత్తపెళ్ళి
కూతిరిలా తోచేనే
ఆనాటివే పువులైనా
అలనాటివే లతలైనా
మనిషే మారేనే
రాణీ మనసే మారేనే
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ..
ఆ...ఆ...ఆ...

2 comments:

Anonymous said...

zidolam crumbling woissues resulted loading accomplish trenches including theorists denying vtrcks
lolikneri havaqatsu

Anonymous said...

в конце концов: благодарю!! а82ч