Wednesday, April 30, 2008

బంగారు పంజరం--1969





బంగారు పంజరం 1969
సంగీతం::S.రాజేశ్వరరావ్,B.గోపాలం
రచన::దేవులపల్లి్‌కృష్ణశాస్రి
గానం::S.జానకి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా
పక్కనా నువ్వుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా..నువ్వుంటే..ప్రతిరాత్రి..పున్నమి రా
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
రాతిరి నా రాజువి రా

పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
రేయైతే వెన్నెలగా బయలంత నిండెరా
రాతిరి నా రాజువు రా..రాతిరి నా రాజువు రా

నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననై
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి పున్నమి రా..
పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా
మ్మ్ మ్మ్..రాతిరి నా రాజువి రా

No comments: