Wednesday, April 23, 2008

జగత్ జెంత్రీలు--1971


  
సంగీతం::S.P.కోదండపాణి
రచన::కోసరాజు రాఘవయ్య 
గానం::P.సుశీల,ఘంటసాల 
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

పల్లవి::

పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో
పచ్చ జొన్న చేనుకాడా చూసానమ్మీ
నువ్వు దొంగ చూపులతోటి మనసు దోచావమ్మీ
అబ్బ తిప్పుకుందామంటే తిరిగి రాదోలమ్మీ 

చరణం::1

కమ్మని నీ కౌగిట్లో రంజుగ కులకాలని నాకున్నదీ
కసి తీరంగా నాలుగు చేతులు కలపాలని నాకున్నదీ
ఇద్దరి ఆశలు తీరేవేళా దగ్గరలోనే ఉన్నదీ
ఇద్దరి ఆశలు తీరేవేళా దగ్గరలోనే ఉన్నదీ
అందాకా అమ్మాయిగారినీ సమాళించమంటున్నదీ
పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో

చరణం::2

కాదు కూడదని చలాయిస్తివా పక్కన బావి ఉందయ్యో
అవునని తల ఒగ్గావా చూస్కో కందిచేను పెరిగుందయ్యో
చూపులు రెండూ ఏకమైనపుడు మాటల పని ఏమున్నదీ
చూపులు రెండూ ఏకమైనపుడు మాటల పని ఏమున్నదీ
పూల తెప్పపై హాయి హాయిగా తేలిపోతే హాయున్నదీ
పచ్చ జొన్న చేనుకాడా చూసానయ్యో
నువ్వు పైలా పచ్చీసు మీదా ఉన్నావయ్యో
అబ్బ పండు వంటి కన్నె మనసు లాగావయ్యో

No comments: