Thursday, March 01, 2012

హిట్లర్--1997




సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు , చిత్ర


నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నా మేస్త్రీ
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నా మేస్త్రీ

హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ


అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు
జివ్వుమన్న రవ్వలడ్డు హో హో హో హో
ఆభ్ఛ్ లో లేని Z ఏపుగున్న బుగ్గ రెడ్డు లేతగున్న నీటిబొట్టు హో హో హో
అలకా కులుకూ ఎప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే
పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
అలకా కులుకూ ఎప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే
పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
తనువే పలికే కసి ఖవాలి నరమే ఉలికే ఎద మనాలి
తెరలే తెరచి పద తెనాలి పదవే పొదకే పసి మరాళి
హబిబీ హబిబీ హబిబీ హబిబీ హబిబీ హబిబీ


నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి

రాజమండ్రి రేవుకాడా రంగసాని మేడకాడ రాతిరేళ రవ్వదంట
నాయూడోరి ఇంటికాడ నల్లతుమ్మ సెట్టు నీడ ఎన్నెలంతా ఎంకిదంట
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందెవెస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందెవెస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జత జవానీ పరువం పలికే ప్రియ భవాని
తొలిగా పడితే చెలి నిషాని జరిగే జతులే యమ కహాని
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హే హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

Wednesday, February 29, 2012

మొహమ్మద్ బిన్ తుగ్లాఖ్--1972


సంగీతం::S.హనుమంతరావ్
రచన::కోసరాజు
గానం::SP.బాలు,కోరస్  
Film Director By::BV.Prasad 
తారాగణం::నాగభూషణం,క్రిష్ణంరాజు,రమాప్రభ,చాయాదేవి,సంధ్యారాణి,లీలారాణి,రాజబాబు,నాగయ్య,రావికొండలరావు,అల్లురామలింగయ్య,K.V.చలం,కోళ్ళసత్యం,ch.క్రిష్ణమూర్తి,జయకుమారి,SP.బాలసుబ్రమణ్యం .{Juest}  


బాలు గారు మొదటిసారి తెరమీద పాడుతూ కనిపించే పాట

పల్లవి::

Happy birthday to you
Happy birthday to you

Happy birthday to you
Happy birthday to you

దేశంకోసం మీ తండ్రెంతో..దీక్షతో త్యాగంచేసాడు 
దేశంకోసం మీ తండ్రెంతో..దీక్షతో త్యాగంచేసాడు 
ప్రజాసేవకై కుటుంబమంత..పలుబాధల పాలైనారూ  

నాయకీ శుభదాయకీ..జైజైలు మహా జాతకీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ Happy birthday to you
Happy birthday to you

చరణం::1

లాలలా ఆ ఆ ఆ రరరరా
ఆహ ఆహా ఏహే ఏహే లలలాలా
hello hello madem
నీలాంటి లేడీని చూడం

hello hello madem
నీలాంటి లేడీని చూడం

అధికారం నీసొత్తు..కాదన్నవాడిపని చిత్తు
ఏస్తావులే ఎత్తుకు ఎత్తు..మెచ్చేరు జనం యావత్తు 

అధికారం నీసొత్తు..కాదన్నవాడిపని చిత్తు
ఏస్తావులే ఎత్తుకు ఎత్తు..మెచ్చేరు జనం యావత్తు 

wonderful నీ life.. wonderful నీ life 
నీవుంటే మాకు safe..ఊఊఊఉ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ Happy birthday to you
Happy birthday to you

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్త్రీ జాతంతా నిన్నుచూసుకొని
చిందులు తొక్కుతు ఉన్నది

స్త్రీ జాతంతా నిన్నుచూసుకొని
చిందులు తొక్కుతు ఉన్నది
బీదా సాదా ఉద్ధరింతువని..నోళ్ళుతెరచి చూస్తున్నది

నాయకీ శుభదాయకీ..జైజైలు మహా జాతకీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ Happy birthday to you
Happy birthday to you 

చరణం::3

లాఆ ఆ ఆ హా ఏఏఏ..హేహే..ఏఏఏఏ
రారరార రీరిరీరి..ఓహొ ఓ ఓ ఓ ఓ

నిన్ను నమ్ముకొన్నాము..నీవెంట తిరుగుతున్నాము
నిన్ను నమ్ముకొన్నాము..నీవెంట తిరుగుతున్నాము
అవకాశం ఉన్నప్పుడు..మరవవద్దు మమ్మెప్పుడు

నాయకీ శుభదాయకీ..జైజైలు మహా జాతకీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ Happy birthday to you
Happy birthday to you 


Mohammad Bin Tughlaq--1972
Music::S.HanumantaRao
Lyrics::Kosaraaju
Singer's::S.P.Baalu,(Chorus)   
Film Director By::BV.Prasad

Cast::Nagabhushanam, Ramaprabha, Chaya Devi, Sandhya Rani, Leela Rani, Raja Babu, Krishnam Raju, Nagaiah, Ravi Kondala Rao, Allu Ramalingaiah, KV Chalam, Kolla Satyam, Ch. Krishna Murthy, Jaya Kumari, SP Balasubrahmanyam (guest) 

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

`Happy birthday to you
Happy birthday to you

Happy birthday to you
Happy birthday to you`

dESamkOsam mee tanDrentO..deekshatO tyaagamchEsaaDu 
dESamkOsam mee tanDrentO..deekshatO tyaagamchEsaaDu 
prajaasEvakai kuTuMbamanta..palubaadhala paalainaaruu  

naayakii Subhadaayakii..jaijailu mahaa jaatakii
aa aa aa aa aa aa `Happy birthday to you
Happy birthday to you`

:::::1

laalalaa aa aa aa rarararaa
aaha aahaa EhE EhE lalalaalaa
`hello hello madem`
neelaanTi lEDiini chooDam

`hello hello madem`
neelaanTi lEDiini chooDam

adhikaaram neesottu..kaadannavaaDipani chittu
EstaavulE ettuku ettu..mechchEru janam yaavattu 

adhikaaram neesottu..kaadannavaaDipani chittu
EstaavulE ettuku ettu..mechchEru janam yaavattu 

`wonderful` nee `life`.. `wonderful` nee `life` 
neevunTE maaku `safe`..uuuuuuu

aa aa aa aa aa aa `Happy birthday to you
Happy birthday to you`

::::2

aa aa aa aa aa aa aa aa aa aa aa
stree jaatantaa ninnuchoosukoni
chindulu tokkutu unnadi

stree jaatantaa ninnuchoosukoni
chindulu tokkutu unnadi
beedaa saadaa uddharintuvani..nOLLuterachi choostunnadi

naayakii Subhadaayakii..jaijailu mahaa jaatakii
aa aa aa aa aa aa `Happy birthday to you
Happy birthday to you` 

::::3

laaaaa aa aa haa EEE..hEhE..EEEE
raararaara riiririiri..Oho O O O O

ninnu nammukonnaamu..neevenTa tirugutunnaamu
ninnu nammukonnaamu..neevenTa tirugutunnaamu
avakaaSam unnappuDu..maravavaddu mammeppuDu

naayakii Subhadaayakii..jaijailu mahaa jaatakii
aa aa aa aa aa aa `Happy birthday to you

Happy birthday to you` 

మొహమ్మద్ బిన్ తుగ్లాఖ్--1972




సంగీతం::S.హనుమంతరావ్
రచన::దాశరధి
గానం::SP.బాలు,LR.ఈశ్వరి.
Film Director By::BV.Prasad 
తారాగణం::నాగభూషణం,క్రిష్ణంరాజు,రమాప్రభ,చాయాదేవి,సంధ్యారాణి,లీలారాణి,రాజబాబు,నాగయ్య,రావికొండలరావు,అల్లురామలింగయ్య,K.V.చలం,కోళ్ళసత్యం,ch.క్రిష్ణమూర్తి,జయకుమారి,SP.బాలసుబ్రమణ్యం .{Juest}  

పల్లవి::

అహ్హా హహహ అహ్హా హహ 
హాయ్..కొంటేచూపుల..చిలకమ్మ
నీ జంత నేనే లేవమ్మ

కొంటేచూపుల..చిలకమ్మ
నీ జంత నేనే లేవమ్మ

ఇంతకాలం దాగిన కోరిక
నేడుతీరును రావమ్మా..నేడుతీరును రావమ్మా

చిలిపిచూపుల చినవాడా..నా వలపుకోరే మొనగాడా
చిలిపిచూపుల చినవాడా..నా వలపుకోరే మొనగాడా
వట్టిమాటలు చెబితే చాలదు..చేయికలపగ రావయ్యా
చేయికలపగ రావయ్యా

కొంటేచూపుల చిలకమ్మా
నీకొంగుపట్టుకొని తిరిగేనమ్మా..ఓపిల్లా
ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా పిల్లా పిల్లా పిల్లా

కొంటేచూపుల చిలకమ్మా
నీకొంగుపట్టుకొని తిరిగేనమ్మా

కొంటేవాడిని అయ్యో ఒంటివాడిని
తోడుగ ఉంటే..పుణ్యమంతా నీదమ్మా
పుణ్యమంతా నీదమ్మా 

దొంగమాటల దొరగారూ..నే లొంగిపోతాననుకోకు
ఓ రాజా ఓ రాజా ఓరా రాజా రాజా రాజాబాబూ..ఓయ్ 

దొంగమాటల దొరగారూ..నే లొంగిపోతాననుకోకు
కొంటేమురిపం తీరిందంటే..చెంతకైనా రావయ్యా
చెంతకైనా రావయ్యా


చరణం::1

కన్నులుచెప్పే..కన్నులుచెప్పే
కథలే వింటే ఎన్నో ఎన్నో ఉన్నాయి
  
ఆ కథలన్నీ నాకలలన్నీ
నేడేనిజమైపోవాలీ..నేడేనిజమైపోవాలి

చిలిపిచూపుల చినవాడా..నా వలపుకోరే మొనగాడా

చరణం::2

కాదంటునే ఔనన్నావు..అందని మనసే అందించావు
కొకరకో..కౌగిట చేర్చి కవ్విస్తుంటే 
కౌగిట చేర్చి కవ్విస్తుంటే..కాదనలేక ఔనన్నా

కొంటేచూపుల చిలకమ్మా
నీకొంగుపట్టుకొని తిరిగేనమ్మా

కొంటేమురిపం తీరిందంటే..చెంతకైనా రావయ్యా
చెంతకైనా రావయ్యా


Mohammad Bin Tughlaq--1972
Music::S.HanumantaRao
Lyrics::Dasarathi
Singer's::S.P.Baalu,L.R.Iswari
Film Director By::BV.Prasad
Cast::Nagabhushanam, Ramaprabha, Chaya Devi, Sandhya Rani, Leela Rani, Raja Babu, Krishnam Raju, Nagaiah, Ravi Kondala Rao, Allu Ramalingaiah, KV Chalam, Kolla Satyam, Ch. Krishna Murthy, Jaya Kumari, SP Balasubrahmanyam (guest)


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ahhaa hahaha ahhaa haha 
haay..konTEchoopula..chilakamma
nee janta nEnE lEvamma

konTEchoopula..chilakamma
nee janta nEnE lEvamma

intakaalam daagina kOrika
nEDuteerunu raavammaa..nEDuteerunu raavammaa

chilipichoopula chinavaaDaa..naa valapukOrE monagaaDaa
chilipichoopula chinavaaDaa..naa valapukOrE monagaaDaa
vaTTimaaTalu chebitE chaaladu..chEyikalapaga raavayyaa
chEyikalapaga raavayyaa

konTEchoopula chilakammaa
neekongupaTTukoni tirigEnammaa..Opillaa
O pillaa O pillaa O pillaa pillaa pillaa pillaa

konTEchoopula chilakammaa
neekongupaTTukoni tirigEnammaa

konTEvaaDini ayyO onTivaaDini
tODuga unTE..puNyamantaa needammaa
puNyamantaa needammaa 

dongamaaTala doragaaruu..nE longipOtaananukOku
O raajaa O raajaa Oraa raajaa raajaa raajaabaabuu..Oy 

dongamaaTala doragaaruu..nE longipOtaananukOku
konTEmuripam teerindanTE..chentakainaa raavayyaa
chentakainaa raavayyaa


::::1

kannulucheppE..kannulucheppE
kathalE vinTE ennO ennO unnaayi
  
A kathalannii naakalalannii
nEDEnijamaipOvaalii..nEDEnijamaipOvaali

chilipichoopula chinavaaDaa..naa valapukOrE monagaaDaa

::::2

kaadanTunE ounannaavu..andani manasE andinchaavu
kokarakO..kougiTa chErchi kavvistunTE 
kougiTa chErchi kavvistunTE..kaadanalEka ounannaa

konTEchoopula chilakammaa
neekongupaTTukoni tirigEnammaa

konTEmuripam teerindanTE..chentakainaa raavayyaa

chentakainaa raavayyaa


Monday, February 27, 2012

అగ్గిదొర--1967


సంగీతం::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::కాంతారావు,భారతి,విజయలలిత,ధూళిపాళ,సత్యనారాయణ,బాలక్రిష్ణ.

పల్లవి::

తొలిరేయి గుండెలోవిరిసే..మలిరేయి కళ్ళలో మెరిసే 
అదేమిటో తెలుసు..అదేకదా నీ వలపు

తొలిరేయి నా కలలో కదలి..మలిరేయి కౌగిలిలో మెదలి
అదేమిటో తెలుసు..అదే సుమానీ పిలుపు

చరణం::1

నీవన్నది నేనన్నది..తెలిసే తెలిసే తెలిసే
నీ కనులు నా కన్నులు..కలిసే కలిసే కలిసే

నీవన్నది నేనన్నది..తెలిసే తెలిసే తెలిసే
నీ కనులు నా కన్నులు..కలిసే కలిసే కలిసే
కనులేనా కలిసినవి..కనులేనా కలిసినవి
మన మనసులు పెనవేసినవీ..ఈ

చరణం::2

నీ అందమే అనుబంధమై..వెలసే వెలసే వెలసే..ఏఏఏ
నీరూపమె మణిదీపమై..వెలిగె వెలిగె వెలిగే

నీ అందమే అనుబంధమై..వెలసే వెలసే వెలసే
నీరూపమె మణిదీపమై..వెలిగె వెలిగె వెలిగే

జగమంతా పులకించే..జగమంతా పులకించే
గగనాలే..తలవంచే 

తొలిరేయి గుండెలోవిరిసే..మలిరేయి కళ్ళలో మెరిసే 
అదేమిటో తెలుసు..అదేకదా నీ వలపు

Saturday, February 25, 2012

మయా బజార్--1957

మోహినీ భస్మాసుర డ్యాన్స్


Thursday, February 23, 2012

ఎవరికివారే యమునాతీరే--1974



సంగీతం::చక్రవర్తి
రచన::గోపి
గానం::S.P.బాలు
తారాగణం::రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజారమణి

పల్లవి::

ఎవరికి వారే..యమునాతీరే
ఎవరికి వారే..యమునాతీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ..పోతూనే వుంటారు
పోతూనే...వుంటారూ   
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::1

రాజ్యాలను ఏలినారు..వేల వేల రాజులు
చివరి కెవరు వుంచినారు కులసతులకు గాజులు
కులసతులకు..గాజులు 
కట్టించిన కోటలన్ని..మిగిలి పోయేనూ
కట్టుకొన్న మహారజులు..తరలిపోయనూ తరలిపోయనూ         
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::2

కన్నీరు ఒక్కటైనా..నవ్వూ ఏడ్పూ వేరు వేరు
జీవిత మొక్కటైనా..చావు పుటక వేరు వేరు
ఆకాశ మొక్కటైనా..ఎండా వానా వేరు వేరు 
వెలుగనేది ఒక్కటైనా..సూర్యుడూ చంద్రుడూ వేరు వేరు    
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::3

ఊపిరి చొరబడితే..పుట్టాడంటారూ
ఊపిరి నిలబడితే..పోయాడంటారూ
గాలివాటు బతుకులు..ఒట్టినీటి బుడగలు
గాలివాటు బతుకులు..ఒట్టినీటి బుడగలు 
నిజమింతే తెలుసుకో..నిజమింతే తెలుసుకో .  
కలతమరిచి నిదురపో..కలతమరిచి నిదురపో  
ఎవరికి వారే..యమునాతీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే వుంటారు..పోతూనే వుంటారూ   
ఎవరికి వారే యమునాతీరే..ఎవరికి వారే యమునాతీరే

Tuesday, February 14, 2012

పవిత్ర బంధం--1971




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల,స్వర్ణలత 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి 
సవాలు చేస్తూ...పోతుంది
అహ జోరు జోరుగ పోతుంది    
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి 
సవాలు చేస్తూ...పోతుంది
అహ జోరు జోరుగ..పోతుంది

చరణం::1
    
బుర్రి పిట్టవలె సైకిలు మీద తుర్రున బోయెర 
సోగ్గాడు అహ పట్నం పోయెర సోగ్గాడు
డాబుకు పోయి జేబు దులుపుకొని 
దేబె మొకముతో వస్తాడు..అహ వస్తాడు
ప్రజలకు పుష్టిగ తిండి పెట్టుటకు కష్టించును 
ఆ కుర్రోడు అతడే నిజమగు రైతు..బిడ్డడు 
అడుగో..అడుగో..అటు..చూడు 
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి

చరణం::2
    
కడుపు కట్టుకొని పాలూ..పెరుగూ 
అమ్మబోతది..అచ్చమ్మా ఈ అచ్చమ్మా
డబ్బు కాశపడి..దొడ్లో కూరలు 
టౌనుకేస్తది..బుచ్చమ్మా ఈ బుచ్చమ్మా
పాడీ పంటా పట్నంపాలు..పచ్చడి మెతుకులు మనపాలు 
పల్లెటూళ్ళ కథ యింతేను..ఎన్నాళ్ళిలాగ జరిగేను     
ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి
గణ గణ గణ గణ గంటల బండి
పల్లెటూరి యీ పడుచుల బండి 
సవాలు చేస్తూ..పోతుంది
అహ జోరు జోరుగ..పోతుంది

Monday, February 13, 2012

డబ్బుకు లోకం దాసోహం--1973



.......
సంగీతం::K.V.మహాదేవన్
రచన::సినారె
గానం::ఘటసాల,P.సుశీల

ఎక్కడికో ??

తమరెక్కడికో..??

చెప్పనా..

మ్మ్..

నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా?
నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట

ఆ బాట ఏనాడు తిరుగులేనిది
ఆ మాట ఏనాడు తీరిపోనిది

ఆ బాట ఏనాడు తిరుగులేనిది
ఆ మాట ఏనాడు తీరిపోనిది

నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట

చరణం::1

దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి
దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి

తూరుపున కిరణాలు ఉదయించాయి
తూరుపున కిరణాలు ఉదయించాయి
గగన తీరాలను అందుకోను పయనించాయి
గగన తీరాలను అందుకోను పయనించాయి

మరి మన పయనం ఎందాక ఎందాక

ఆ శిఖరాలు తీరాలు అందేదాక...

నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట

చరణం::2

చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి

చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి

వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి
వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి

అవి ముత్తెపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి

మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు


నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట

నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట

Wednesday, February 08, 2012

ఆడదాని అదృష్టం--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4670
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి    
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..ఆహాయ్ 

చరణం::1

చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
ఒళ్ళంత నాజూకు..ఊఊ హోయ్..ఒళ్ళంత నాజూకు
కళ్ళలో ఉందిరోయ్..కావలసిన షోకు
లేలేత అందాలు..వీలైన సరదాలు
లేలేత అందాలు..వీలైన సరదాలు
మోజైన మురిపాలు..తాజాగ అందిస్తాను 
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా..ఆఆ             
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ..హోయ్

చరణం::2

చూపుతో మంటలు రగిలించీ..నవ్వుతో మల్లెలు కురిపించీ
అంతలో తొలి గిలిగింతలతో..వింతగా నిను కవ్విస్తాను
రేయైన పగలైనా ఏవేళ ఏమైనా..రేయైన పగలైనా ఏవేళ ఏమైనా
నీ వేడి ఒడిలోన నేనొదిగి..వుంటాను నేనొదిగి వుంటాను        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీఈఈఇ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::1

చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
ఆడినదే ఆట తను..పాడినదే పాట 
ఆడినదే ఆట తను..పాడినదే పాట
అది చూచి మైమరచే తల్లే కద తల్లీ 
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::2

బాలపాప పలుకులే..పంచదార చిలకలు 
బాలపాప పలుకులే..పంచదార చిలకలు
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న 
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
ఆ కళ్ళే కమలాలు..అవి దేవుని గుళ్ళు  
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::3

ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
వెలగాలి మా బాబు..వెయ్యేళ్ళ దీపం..మ్మ్
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
లల్లాలలాలలా ల్లల్లాలలాలల 
మ్మ్ హూ..మ్మ్ హూ