.......
సంగీతం::K.V.మహాదేవన్
రచన::సినారె
గానం::ఘటసాల,P.సుశీల
ఎక్కడికో ??
తమరెక్కడికో..??
చెప్పనా..
మ్మ్..
నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా?
నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట
ఆ బాట ఏనాడు తిరుగులేనిది
ఆ మాట ఏనాడు తీరిపోనిది
ఆ బాట ఏనాడు తిరుగులేనిది
ఆ మాట ఏనాడు తీరిపోనిది
నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
చరణం::1
దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి
దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి
తూరుపున కిరణాలు ఉదయించాయి
తూరుపున కిరణాలు ఉదయించాయి
గగన తీరాలను అందుకోను పయనించాయి
గగన తీరాలను అందుకోను పయనించాయి
మరి మన పయనం ఎందాక ఎందాక
ఆ శిఖరాలు తీరాలు అందేదాక...
నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
చరణం::2
చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి
చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి
వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి
వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి
అవి ముత్తెపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి
మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట
No comments:
Post a Comment