Showing posts with label ఎవరికివారే యమునాతీరే--1974. Show all posts
Showing posts with label ఎవరికివారే యమునాతీరే--1974. Show all posts

Thursday, February 23, 2012

ఎవరికివారే యమునాతీరే--1974



సంగీతం::చక్రవర్తి
రచన::గోపి
గానం::S.P.బాలు
తారాగణం::రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజారమణి

పల్లవి::

ఎవరికి వారే..యమునాతీరే
ఎవరికి వారే..యమునాతీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ..పోతూనే వుంటారు
పోతూనే...వుంటారూ   
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::1

రాజ్యాలను ఏలినారు..వేల వేల రాజులు
చివరి కెవరు వుంచినారు కులసతులకు గాజులు
కులసతులకు..గాజులు 
కట్టించిన కోటలన్ని..మిగిలి పోయేనూ
కట్టుకొన్న మహారజులు..తరలిపోయనూ తరలిపోయనూ         
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::2

కన్నీరు ఒక్కటైనా..నవ్వూ ఏడ్పూ వేరు వేరు
జీవిత మొక్కటైనా..చావు పుటక వేరు వేరు
ఆకాశ మొక్కటైనా..ఎండా వానా వేరు వేరు 
వెలుగనేది ఒక్కటైనా..సూర్యుడూ చంద్రుడూ వేరు వేరు    
ఎవరికి వారే..యమునాతీరే

చరణం::3

ఊపిరి చొరబడితే..పుట్టాడంటారూ
ఊపిరి నిలబడితే..పోయాడంటారూ
గాలివాటు బతుకులు..ఒట్టినీటి బుడగలు
గాలివాటు బతుకులు..ఒట్టినీటి బుడగలు 
నిజమింతే తెలుసుకో..నిజమింతే తెలుసుకో .  
కలతమరిచి నిదురపో..కలతమరిచి నిదురపో  
ఎవరికి వారే..యమునాతీరే
ఎక్కడో పుడతారు..ఎక్కడో పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పోతూనే వుంటారు..పోతూనే వుంటారూ   
ఎవరికి వారే యమునాతీరే..ఎవరికి వారే యమునాతీరే

Sunday, February 05, 2012

ఎవరికివారే యమునాతీరే--1974


సంగీతం::చక్రవర్తి
రచన::గోపి
గానం::P.సుశీల
తారాగణం::రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజారమణి

పల్లవి::

జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::1

లోకమంత వెన్నెలచేసి..చీకటిలో నను వుంచావు
వేదనతో నే నున్నానూ..వేడుకగా నువు చూచేవూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::2

నీవూ ఒక మనిషిగ పుడితే - నీ చూపే కరువైపోతే
నాలాగే విలపించేవూ..ప్రతి దేవుని నిందించేవూ..ఓఓఓ      
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::3

నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ
నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ 
ఈ కనుల కోసమైనా నేనూ..మరల మరల పుడుతుంటానూ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా  
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా