Wednesday, February 08, 2012

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::1

చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
ఆడినదే ఆట తను..పాడినదే పాట 
ఆడినదే ఆట తను..పాడినదే పాట
అది చూచి మైమరచే తల్లే కద తల్లీ 
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::2

బాలపాప పలుకులే..పంచదార చిలకలు 
బాలపాప పలుకులే..పంచదార చిలకలు
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న 
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
ఆ కళ్ళే కమలాలు..అవి దేవుని గుళ్ళు  
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::3

ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
వెలగాలి మా బాబు..వెయ్యేళ్ళ దీపం..మ్మ్
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
లల్లాలలాలలా ల్లల్లాలలాలల 
మ్మ్ హూ..మ్మ్ హూ 

No comments: