సంగీతం::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::కాంతారావు,భారతి,విజయలలిత,ధూళిపాళ,సత్యనారాయణ,బాలక్రిష్ణ.
పల్లవి::
తొలిరేయి గుండెలోవిరిసే..మలిరేయి కళ్ళలో మెరిసే
అదేమిటో తెలుసు..అదేకదా నీ వలపు
తొలిరేయి నా కలలో కదలి..మలిరేయి కౌగిలిలో మెదలి
అదేమిటో తెలుసు..అదే సుమానీ పిలుపు
చరణం::1
నీవన్నది నేనన్నది..తెలిసే తెలిసే తెలిసే
నీ కనులు నా కన్నులు..కలిసే కలిసే కలిసే
నీవన్నది నేనన్నది..తెలిసే తెలిసే తెలిసే
నీ కనులు నా కన్నులు..కలిసే కలిసే కలిసే
కనులేనా కలిసినవి..కనులేనా కలిసినవి
మన మనసులు పెనవేసినవీ..ఈ
చరణం::2
నీ అందమే అనుబంధమై..వెలసే వెలసే వెలసే..ఏఏఏ
నీరూపమె మణిదీపమై..వెలిగె వెలిగె వెలిగే
నీ అందమే అనుబంధమై..వెలసే వెలసే వెలసే
నీరూపమె మణిదీపమై..వెలిగె వెలిగె వెలిగే
జగమంతా పులకించే..జగమంతా పులకించే
గగనాలే..తలవంచే
తొలిరేయి గుండెలోవిరిసే..మలిరేయి కళ్ళలో మెరిసే
అదేమిటో తెలుసు..అదేకదా నీ వలపు
No comments:
Post a Comment