Thursday, January 12, 2012

మూగప్రేమ--1971

సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,జి.వరలక్ష్మి

పల్లవి::

లాలలాలాలలా లాలలలలలా లలలా లలలా లాలాలాలా   
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
చదవాలి మీ రెదగాలి చక్కని..మనుషులుగా చిక్కని మనసులుగా
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ         
ముందుందయ్యా జీవితమూ..ముళ్ళు పూలూ కలసిన మార్గము
ముందుందయ్యా జీవితమూ..ముళ్ళు పూలూ కలసిన మార్గము
ముళ్ళను చూసి భయపడకు..అన్నీ పూలని భ్రమపడకు    
ముళ్ళను చూసి భయపడకు..అన్నీ పూలని భ్రమపడకు
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇచ్చాడమ్మా ఒకటే బ్రతుకు..బ్రతకాలమ్మా తుదివరకూ
ఇచ్చాడమ్మా ఒకటే బ్రతుకు..బ్రతకాలమ్మా తుదివరకూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మానుకు వున్నది చిగిరించడము..మనిషికి లేదు మల్లి జన్మము 
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు
చదవాలి మీ రెదగాలి చక్కని..మనుషులుగా చిక్కని మనసులుగా
జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు..చిలిపితనాల తమ్ముళ్ళు

Wednesday, January 11, 2012

పగబట్టిన పడుచు--1971

సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  
మరుమల్లె వెల యెంత..మరుమల్లె వెల యెంత
సిరులేవీ...కొనలేనంత 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  

చరణం::1

ఆ..ఆహా..ఆ..ఆహా
నీ బుగ్గలమీద గులాబీలు..దూసుకోనా 
నీ కళ్ళలోన నా నీడ..చూసుకోనా 
నీ బుగ్గలమీద గులాబీలు..దూసుకోనా 
నీ కళ్ళలోన నా నీడ..చూసుకోనా 
గులాబీలు దూసేముందు చెలి వలపే తెలుసుకో 
చెలి వలపే...తెలుసుకో
గులాబీలు దూసేముందు..చెలి వలపే తెలుసుకో  
కళ్ళలో చూసే ముందు..కన్నె మనసు దోచుకో 
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత
ఆ..ఆహా..ఆ..ఆహా
   
చరణం::2
     
నా వన్నెలు చూసీ..నిన్ను నీవే మరిచేవా 
మరి ఎన్నడు వీడని..తీయని బంధం వేసేవా
నా వన్నెలు చూసీ..నిన్ను నీవే మరిచేవా 
మరి ఎన్నడు వీడని..తీయని బంధం వేసేవా
బ్రతుకంతా నీ కౌగిలిలో బందీగా వుంటాను బందీగా వుంటాను
బ్రతుకంతా నీ కౌగిలిలో..బందీగా వుంటాను  
అనురాగ బంధంలోన..నను నేనే మరిచేను
ఆ...ఆహా...ఆ...ఆహా
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత
చిరునవ్వు వెలయెంత..మరుమల్లె పువ్వంత  
మరుమల్లె వెల యెంత..మరుమల్లె వెల యెంత
సిరులేవీ...కొనలేనంత ఆ 

హేమాహేమీలు--1974

సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ 

పల్లవి::

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోపతాపాలకు..ఆ తీపి శాపాలకు
ఈ కోపతాపాలకు..ఆ తీపి శాపాలకు   
అందించనా నీకు..హరిచందనాలు

నీ కోలకళ్ళకి..నీరాజనాలు
ఆ వాలు చూపుకు..అభివందనాలు 

చరణం::1

కోటేరులాంటి..ఆ కొస ముక్కు
ప్రొద్దు నిద్దర లేచినట్టు..ఆ బొట్టు
మిసమిసలు..పసిగట్టి కసిపట్టి బుసకొట్టే
పగడెత్తు పైటున్న..ఆ చీరకట్టు

జిగినీల జాకెట్టు..సొగసైన లాకెట్టు
జిగినీల జాకెట్టు..హో..సొగసైన లాకెట్టు 
విడిచి పెడితే బెట్టు..నా మీద ఒట్టు 

నీ కొంటె కవితకి..నీరాజనాలు
ఆ వాడి చూపుకు..అభివందనాలు
ఈ ఆపసోపాలకు..ఆ విరహ తాపాలకు
ఈ ఆపసోపాలకు..ఆ విరహ తాపాలకు  
అందించనా నేను..సుస్వాగతాలు 

నీ కొంటె కవితకి..నీరాజనాలు
ఆ వాడి చూపుకు..అభివందనాలు 

చరణం::2

నీ వలపే..ఉసి గొలుపు..నా చెలిమే చేయి కలుపు
పొలిమేరలో పిలుపు..పులకింతలే రేపు

జడలోని మల్లికలు..జవరాలి అల్లికలు
చలి పెంచే కోరికలు..జాబిలితో కలయికలు

ఈ ఆరుబయటా..అందాల అల్లరులు
ఈ పూట నాలో పలికించే..కిన్నెరలు
కలిసిపోనా ఏరు నీరై..నేనింక నీవై..నీవింక నేనై

నీ కోలకళ్ళకి.నీరాజనాలు
ఆ వాలు చూపుకు..అభివందనాలు

Monday, January 09, 2012

ఆడదాని అదృష్టం--1975

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4669
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి  
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ
ఓ చందమామ...ఇదే స్వర్గ సీమా 
ఓ చందమామ...ఇదే స్వర్గ సీమా  
                  
ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ
ఓ చందమామ...ఇదే స్వర్గ సీమా
ఓ చందమామ...ఇదే స్వర్గ సీమా                    
ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ

చరణం::1

కులికే వగలొలికే..కోటి తారలు నీకున్న గానీ
కులికే వగలొలికే..కోటి తారలు నీకున్న గానీ
ఎన్నడూ వాడని...కలువను నేను
ఎన్నడూ వాడని...కలువను నేను
ఎవ్వరూ చూడని విలువను నేను..విలువను నేను  
ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ

చరణం::2

చెలినే ఈ చెలినే తెలవారితే..నీవే మరిచినా
చెలినే ఈ చెలినే తెలవారితే..నీవే మరిచినా
ఈ మధురిమలే మరువను..నేను
ఈ మధురిమలే మరువను..నేను 
మరిమరి నీవు...మరిమరి రాకుంటే 
విడువను నిన్ను..విడువను నిన్ను    
ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ
ఓ చందమామ..ఇదే స్వర్గ సీమా
ఈ రేయి పోనీయనూ..ఇంక ఎవరినీ రానీయనూ
ఓ చందమామ..ఇదే స్వర్గ సీమా
ఓ చందమామ..ఇదే స్వర్గ సీమా
ఈ రేయి పోనీయనూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

Friday, January 06, 2012

బంట్రోతు భార్య--1974

సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::సినారె 
గానం::P.సుశీల,S.జానకి,చంద్రశేఖర బృందం.  
తారాగణం::చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల    

పల్లవి::

ధనమే ఈ జగతికి...మూలం
ధాన్యమే జనులకు...ప్రాణం
ధనమే ఈ జగతికి మూలం..ఆ 
దనం లేనిదే క్షణం కదలదూ 
ఈ లోకం...ఈ లోకం 
ధనమే ఈ జగతికి...మూలం
ధాన్యమే జనులకు...ప్రాణం
ఆ ధాన్యం లేనిదే..లేడు మానవుడు 
లేనేలేదు జీవనం..ధాన్యమే జనులకు ప్రాణం

చరణం::1

మొదట దేవుడు..ధాన్యాన్ని సృష్ఠించాడూ
ఆ పిదపనే..మానవుణ్ణి పుట్టించాడూ
మనిషికి దురాశ కలిగి..అధికారం మోజు పెరిగి 
తల తిరిగీ ధనాన్ని కలిగించాడూ..మంచి ధనాన్ని బలి చేశాడూ

చరణం::2

హరి తన ఉరమున శిరిని నిలిపి శ్రీహరి అయ్యాడూ
ఆ సిరి కరుణించిన నరుడే భూవరుడయ్యాడూ
ధనముంటేనే చిటికెలోన..దైవ దర్శనం
అది లేకుంటే అవుతుందో లేదో..ధర్మ దర్శనం
ధనమే ఈ జగతికి మూలం..ధాన్యమే జనులకు ప్రాణం

ధాన్యమే జీవన మార్గం..ధనమే ఈ భువిపై స్వర్గం
ధాన్యం తోనే భుక్తీ శక్తీ..ధనముంటేనే రక్తీ ముక్తీ
ఋజువు చేసుకుందామా..నిజం తేల్చుకుందామా
నిజం...తేల్చుకుందామా

Tuesday, January 03, 2012

ధనమా దైవమా--1973

సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::L.R.ఈశ్వరీ,P.సుశీల  
తారాగణం::N.T.రామారావు,జమున,సత్యనారాయణ,పద్మనాభం,చంద్రమోహన్,వెన్నీరాడై నిర్మల,చంద్రకళ.
పల్లవి

రారా..నవ మొహనా..రారా
నవ మొహనా..ఇటు రారా నవమొహనా  
నిముషము యుగముగ నీకై వేచితిని..రారా
నవమోహనా..నవమోహనా..నవమోహనా

ఓ..సిన్నోడా..నా..సిన్నోడా
గున్నమావి తోటకాడ..గుండుమల్లె పొదల నీడ రావేరా..నావోడా 
గున్నమావి తోటకాడ..గుండుమల్లె పొదల నీడ రావేరా..నావోడా 
చెంగావి చీర కట్టి..చేమంతి పూలు చుట్టి..చిలకల్లె వేచానురా
జాము రేతిరి గడిచింది..జాబిల్లి పొడిచింది నేనేమి చేసేదిరా..నా సామి
ఓ..సిన్నోడా..నా..సిన్నోడా
గున్నమావి తోటకాడ..గుండుమల్లె పొదల నీడ రావేరా..నావోడా

ఎక్కడుంటివిర..చక్కనైనదొర..ఎక్కడుంటివిర..చక్కనైనదొర..మావా 
జొన్నరొట్టెలు వెన్నముద్దలు..కన్నె వలపుతో కలిపి తెస్తిరా
జొన్నరొట్టెలు వెన్నముద్దలు..కన్నె వలపుతో కలిపి తెస్తిరా
మావా..నువు రావా..ఓ మావా..నువు రావా
యహుయహు..యహుయహు..యహుయహు..యహు యహు

మురళీ మోహన రావేలరా..మురళీ మోహన రావేలరా
విరిసే వెన్నెల తరగలపైన..మురళీ మోహన రావేలరా 
విరుల సరులు బరువాయరా..చెరగు నిలువ లేదాయెరా 
మారుడే..క్రూరుడై..సుమ శరాళినాటి విరాళి రేపి
వేధించి సాధించె నౌరా..మురళీ మోహన రావేలరా

Monday, January 02, 2012

చందన--1974

సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::S.జానకి
తారాగణం::జయంతి,సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు,శ్రీధర్.

పల్లవి::

పొన్నపూల ఉయ్యాలా..కన్నెవయసే ఊగాలా
ఆఆఆఆ..ఊపుతో ఆకాశమే..ఆ..ఊపుతో ఆకాశమే  
అరికాలికే అందాలా..అందాలా..ఆ..అందాలా  
పొన్నపూల ఉయ్యాలా..కన్నెవయసే ఊగాలా

చరణం::1

చిలకలు చిలకలు చిలకని..అంటారే
చిలకలు చిలకలు చిలకలని..అంటారే
కానీ..ఊఊ..కానీ..చిలకల కేమున్నాయి 
పలుకులే...ఉత్తుత్తి...పలుకులే  
కోయిలలు కోయిలలు కోయిలలనీ..అంటారే  
కోయిలలు కోయిలలు కోయిలలనీ..అంటారే
కాని..ఊఊ..కానీ..కోయిలలకు 
ఎమున్నాయి పాటలే..గాలి పాటలే   
ఆఆఆఆ..పలుకులనే మించిన కలికితనం
ఆ..పాటలనే మించిన కమ్మదనం  
కలిగివున్న కన్నె..ఈ వనానికే వన్నె                  
పొన్నపూల ఉయ్యాలా..కన్నెవయసే ఊగాలా

చరణం::2

హంసలు హంసలు హంసలనీ..అంటారే
హంసలు హంసలు హంసలనీ..అంటారే 
కాని..ఊ..కానీ..హంసలకే మున్నాయి 
నడకలే..బుడి..బుడి..నడకలే 
నెమళ్ళు నెమళ్ళు నెమళ్ళని..అంటారే
కాని..ఊ..కానీ..ఆ నెమళ్ళ కేమున్నాయి 
కులుకులే..పై పైని..తళుకులే
ఆఆఆఆఆఆఆ..
ఆ..నడకలనే మించిన ఒయ్యారం  
ఆ..కులుకులనే మించిన సింగారం
కలిగివున్న కన్నె..ఈ వన్నెలకే వన్నె       
పొన్నపూల ఉయ్యాలా..కన్నెవయసే ఊగాలా

Chandana--1974
Music::RameshNayudu
Lyrics::Sinare
Singer::S.Jaanaki
Cast::Jayanti,Satyanarayana,Rajababu,Nirmala,Ranganath,Tyagaraju,Sreedhgar.

::::

ponnapoola uyyaalaa..kannevayase oogaalaa
aaaaaaaa..ooputo aakaaSame..aa..ooputo aakaaSame  
arikaalike andaalaa..andaalaa..aa..andaalaa  
ponnapoola uyyaalaa..kannevayase oogaalaa

:::1

chilakalu chilakalu chilakani..antaare
chilakaalu chilakaalu chilakalani..antaare
kaanee..oooo..kaanee..chilakala kemunnaayi 
palukule...uttutti...palukule  
koyilalu koyilalu koyilalanee..antaare  
koyilalu koyilalu koyilalanee..antaare
kaani..oooo..kaanee..koyilalaku 
emunnaayi paatale..gaali paatale   
aaaaaaaa..palukulane minchina kalikitanam
aa..paatalane minchina kammadanam  
kaligivunna kanne..ee vanaanike vanne                  
ponnapoola uyyaalaa..kannevayase oogaalaa

::::2

hamsalu hamMsalu hamsalanee..antare
hamsaloo hamsaloo hamsalanee..antare
kaani..oo..kaanee..hamsalake munnaayi 
naDakale..buDi..buDi..naDakale 
nemaLLu nemaLLu nemaLLani..antare
kaani..oo..kaanee..aa nemaLLa kemunnaayi 
kulukule..pai paini..taLukule
aaaaaaaaaaaaaa..
aa..naDakalane minchina oyyaaram  
aa..kulukulane minchina singaaram
kaligivunna kanne..ee vannelake vanne       

ponnapoola uyyaalaa..kannevayase oogaalaa

Sunday, January 01, 2012

దేవుడు చేసిన మనుషులు--1973

సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,S.V.రంగారావు,జయలలిత,విజయనిర్మల,కాంచన. 
పల్లవి

ఏయ్..అబ్బో..దోరవయసు చిన్నదీ..లారార లహా  
భలే జోరుగున్నదీ..లారార లహా   
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ           
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా  
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ
దోరవయసు చిన్నదీ..లారార అహా..అహా 

చరణం::1

ఏయ్..ఒళ్ళేలా వుంది..ఒళ్ళా   
ఒళ్ళు జల్లు మంటుంది..నిన్ను చూస్తే
యేదోలా వుంటుందీ..నిన్ను తాకితే
ఒళ్ళు జల్లు మంటుంది..నిన్ను చూస్తే
యేదోలా వుంటుందీ..నిన్ను తాకితే
ఊహూ...వుంటది ఒక్కటిస్తె
గూబ గుయ్..ఈఈ..అంటది 
ఒక్కటిచ్చి ఒక్కసారి..నీవాణ్ణి చేసుకో 
యెన్నటికీ మరువలేని యేన్నో..సుఖాలందుకో ఛీ..ఫో..అబ్బో       
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా    
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ  
దోరవయసు చిన్నదీ..లారార..   
అహ...అహ...ఒహో

చరణం::2

ఒళ్ళు మండిపోతుంది..నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మటుందీ..హద్దు మీరితే
ఒళ్ళు మండిపోతుంది..నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మటుందీ హద్దు మీరితే..అహ..అలాగా 
అలాగిలా గనుకోకు..అందరిలా నన్ను
చడా మడా పేలావో..చెరిగేస్తా చూడు అబ్బో..నిజంగ 
ఏ తారలోను నీ తీరులేదు..ఏ పువ్వులోను నీ నవ్వులేదు
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా    
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది..కవ్విస్తూ వున్నదీ  
దోరవయసు చిన్నదీ..లారార లహా

దేవుడు చేసిన మనుషులు--1973

సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::శ్రీశ్రీ 
గానం::ఘంటసాల  
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,S.V.రంగారావు,జయలలిత,విజయనిర్మల,కాంచన. 
పల్లవి

దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల   
దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల   
గోవింద హరి గోవింద..గోవింద భజ గోవింద 
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద

చరణం::1

వెన్నదొంగ ఆ వెన్నదొంగ..మా తొలి గురువు..మా తొలి గురువు
తొలినుంచే మా కులగురువు..మా కులగురువు 
కోరిన కోరిక తీరాలంటే..కోరిక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి..గోవిందునే ధ్యానించాలి
గోవింద హరి గోవింద..గోవింద భజ గోవింద 
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద

వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల 
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల     
దేవుడు చేసిన...మనుషుల్లారా
మనుషులు చేసిన...దేవుళ్ళారా  
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల

చరణం::2

పేదల నెత్తురు తాల్చిన రూపం..బలిసిన జలగలు దాచిన పాపం
పేదల నెత్తురు తాల్చిన రూపం..బలిసిన జలగలు దాచిన పాపం
మానవులను పీడించే జబ్బు..దేవతలను ఆడించే డబ్బు 
మానవులను పీడించే జబ్బు..దేవతలను ఆడించే డబ్బు
తెలుపో నలుపో జాన్ దేవ్..ఆ తేడా లిక్కడ లేనేలేవ్ 
తెలుపో నలుపో జాన్ దేవ్..ఆ తేడా లిక్కడ లేనేలేవ్
లేనేలేవ్ వినండి డబ్బుల గోల..కనండి మనుషుల లీల
వినండి డబ్బుల గోల..కనండి మనుషుల లీల

చరణం::3

హేఏఏఏఏ..య్యా..  
గాలిబుడగ జీవితం..ఓటి పడవ యవ్వనం 
గాలిబుడగ జీవితం..ఓటి పడవ యవ్వనం
నిన్న మరల రాదు...రాదు రాదు
నేడే నిజం నేడే...నిజం నేడే నిజం
రేపు మనది...కాదు కాదు
నేడే సుఖం నేడే సుఖం..సుఖం సుఖం నేడే సుఖం
కాసే బ్రహ్మానందం..అహ డోసే పరమానందం 
కాసే బ్రహ్మానందం..అహ డోసే పరమానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం 
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం 
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల 
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల
    
చరణం::4

ఆలయాలలో వెలుతురు లేదు..ఆకాశంలో చీకటి లేదు 
ఆలయాలలో వెలుతురు లేదు..ఆకాశంలో చీకటి లేదు
విమానాలలో విహరిస్తుంటే..సముద్రాలనే దాటేస్తుంటే 
విమానాలలో విహరిస్తుంటే..సముద్రాలనే దాటేస్తుంటే
గుడిలో ఎందుకు రామయ్యా..విడుదలచెస్తాం రావయ్యా 
నిను విడుదలచేస్తాం...రావయ్యా 
గుడిలో ఎందుకు రామయ్యా..నిను విడుదలచేస్తాం రావయ్యా  
రామయ్యా రావయ్యా..రామయ్యా లేవయ్య
రామయ్యా రావయ్యా..రామయ్యా లేవయ్య

లేవయ్యా లేవయ్య లేవయ్య లేవయ్య లేవయ్య

డబ్బుకులోకం దాసోహం--1973

సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::మాధవపెద్ది సత్యం 

పల్లవి

తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం::1

దేవేంద్రుడు తాగాడు..రంభతోటి ఆడాడు
బలరాముడు చుక్కేసి..బజార్లంట పడ్డాడు
కాళిదాసు తాగితాగి..కధలెన్నో పాడాడు
తాగినోడికున్న తెలివి..చెప్పడాని కెవిడికలివి         
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం::2

తాటకి చాటుగవచ్చి..తాటిచెట్టు ఎక్కింది
విశ్వామిత్రుడు తనకు..లొట్టిడియ్యమన్నాడు
మారీచుడు సుబాహుడు..మాకెచాలదన్నారు..
మహా మహా వాళ్ళయినా..మందులేందే బతకలేరు      
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం:3

యీవాడకెల్ల పేరుబడ్డ రౌడీగాణ్ణి..ఏయ్..కోపమొచ్చెనంటె చెడ్డతప్పుడోణ్ణి
ఎదురుచెప్పినోడి పీక నొక్కేస్తా..ఘుంటలోనబెట్టి గంటవాయిస్తా               
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా

చిల్లి గవ్వకైన గూడ చెల్లనివాళ్ళు
ఏసుకుంటె పెద్దమనుషులవుతారు
గవర్నమెంటు వాళ్ళుగూడా తాగమన్నరు
డబ్బులొస్తే అదే మాకు చాలునన్నారు..అందుకే

తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
సొరగలోక మగపడతది మైకంలో..సొరగలోక మగపడతది మైకంలో